RRB Paramedical exam date : ఆర్​ఆర్బీ పారామెడికల్​ ఎగ్జామ్​ డేట్స్​పై కీలక అప్డేట్​..-rrb paramedical tentative exam dates announced details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Rrb Paramedical Exam Date : ఆర్​ఆర్బీ పారామెడికల్​ ఎగ్జామ్​ డేట్స్​పై కీలక అప్డేట్​..

RRB Paramedical exam date : ఆర్​ఆర్బీ పారామెడికల్​ ఎగ్జామ్​ డేట్స్​పై కీలక అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

RRB Paramedical exam 2025 : ఆర్​ఆర్బీ పారామెడికల్​ స్టాఫ్​ ఎగ్జామ్​కి సంబంధించి టెంటెటివ్​ డేట్స్​ని ప్రకటించారు. పరీక్ష తాత్కాలిక తేదీతో పాటు ఖాళీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ పారామెడికల్​ స్టాఫ్​ ఎగ్జామ్​.. (Unsplash)

పారామెడికల్ సిబ్బంది నియామక పరీక్షకు సంబంధించిన తాత్కాలిక తేదీల (టెంటెటివ్​ డేట్స్​)ను రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2025 ఏప్రిల్ 28 నుంచి 30 వరకు ఆర్​ఆర్బీ పారామెడికల్​ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరగనుంది.

ఆర్​ఆర్బీ పారామెడికల్​ ఎగ్జామ్​ 2025..

మరోవైపు ఆర్​ఆర్బీ పారామెడికల్​ పరీక్ష 2025కి సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ అండ్ ట్రావెల్ అథారిటీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే) డౌన్​లోడ్ చేసుకోవడానికి లింక్​ని పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ఇస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్లు/ అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.

ఎగ్జామ్​ హాల్లోకి ప్రవేశించే ముందు పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుందని ఆర్ఆర్బీలు తెలిపాయి. అందువల్ల అభ్యర్థులు పరీక్ష రోజున తమ ఒరిజినల్ ఆధార్ కార్డులు లేదా ఈ-వెరిఫైడ్ ఆధార్ ప్రింటౌట్ తీసుకువెళ్లాలి.

“(ఇప్పటివరకు)ఆధార్​ వెరిఫికేషన్​ ద్వారా అభ్యర్థులు తమ అథెంటికేషన్​ని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాము. www.rrbapply.gov.in లాగిన్​ అయ్యి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఫలితంగా ఆర్​ఆర్బీ పారామెడికల్​ ఎగ్జామ్​ సెంటర్​లో ఇబ్బందులు ఉండవు. అప్లికేషన్​ సబ్మీషన్​ సమయంలో ఆధార్​ వెరిఫికేషన్​ చేసుకున్న వారు ఎగ్జామ్​ సెంటర్​కి వెళ్లే ముందు యూఐడీఏఐలో ఆధార్​ అన్​లాక్​ అవ్వలేదని చూసుకోవాలి. అప్పుడు పరీక్ష రోజున ఇబ్బందులు ఉండవు,” అని ఆర్​ఆర్బీలు వెల్లడించాయి.

ఆర్ఆర్బీలు 1376 ఖాళీల భర్తీకి ఈ పారామెడికల్​ రిక్రూట్​మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. అవి..

డైటీషియన్: 5 ఖాళీలు

నర్సింగ్ సూపరింటెండెంట్: 713 ఖాళీలు

ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్: 4 ఖాళీలు

క్లినికల్ సైకాలజిస్ట్: 7 ఖాళీలు

డెంటల్ హైజీనిస్ట్: 3 ఖాళీలు

డయాలసిస్ టెక్నీషియన్: 20 ఖాళీలు

హెల్త్ & మలేరియా ఇన్​స్పెక్టర్ గ్రేడ్ 3: 126 ఖాళీలు

ల్యాబొరేటరీ సూపరింటెండెంట్: 27 ఖాళీలు

పర్ఫ్యూషనిస్ట్: 2 ఖాళీలు

ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2: 20 ఖాళీలు

ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 2 ఖాళీలు

క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 2 ఖాళీలు

ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 ఖాళీలు

రేడియోగ్రాఫర్ ఎక్స్​రే టెక్నీషియన్: 64 ఖాళీలు

స్పీచ్ థెరపిస్ట్: 1

కార్డియాక్ టెక్నీషియన్: 4 ఖాళీలు

ఆప్టోమెట్రిస్ట్: 4 ఖాళీలు

ఈసీజీ టెక్నీషియన్: 13 ఖాళీలు

ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2: 94 ఖాళీలు

ఫీల్డ్ వర్కర్: 19 ఖాళీలు.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లను చూడవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం