RRB NTPC exam dates : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు..
RRB NTPC exam dates : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మీ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు- నాన్ టెక్నీషియన్ పాప్యులర్ కేటగిరీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష 2025 వివరాలు..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ని ఎక్కడ చూడాలి? డేట్‌షీట్ పీడీఎఫ్ లింక్ ఎక్కడ ఉంటుంది? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డును ఎక్కడ- ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అని అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి.
ప్రశ్న : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ విడుదలయ్యాయా?
సమాధానం : ఇంకా లేదు! తొలుత షెడ్యూల్, ఆ తర్వాత అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. అయితే ఈ ఏడాది నిర్వహించిన రిక్రూట్మెంట్లో భాగంగా పరీక్షకు సంబంధించిన సిటీ స్లిప్స్‌ని 10 రోజుల ముందు, అడ్మిట్ కార్డును 4 రోజుల ముందు ఆర్ఆర్బీ విడుదల చేసింది.
ప్రశ్న : డేట్‌షీట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?
సమాధానం : rrb.digialm.com/ RRB websites నుంచి డేట్షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సంబంధిత ఆర్ఆర్బీ సైట్‌కి వెళ్లి పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్న : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డు 2025 ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
సమాధానం : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్స్‌లో విడుదలవుతాయి. అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్/ రోల్ నెంబర్, పుట్టిన రోజు వంటి లాగిన్ క్రెడెన్షియల్స్‌తో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- స్టెప్ 1- ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డుకు సంబంధించిన లింక్‌పై (లైవ్ అయిన తర్వాత) క్లిక్ చేయండి.
- స్టెప్ 2- మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
- స్టెప్ 3- ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డు పీడీఎఫ్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
- స్టెప్ 4- పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకుని తదుపరి అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
ప్రశ్న : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం చూడాల్సిన అధికారిక వెబ్‌సైట్స్ ఏవి?
సమాధానం : ఆర్ఆర్బీ సికింద్రాబాద్ - www.rrbsecunderabad.nic.in
ఆర్ఆర్బీ బెంగళూరు - www.rrbbnc.gov.in
ఆర్ఆర్బీ సిలిగురి - www.rrbsiliguri.org
ఆర్ఆర్బీ త్రివేంద్రం- www.rrbthiruvananthapuram.gov.in.
ఆర్ఆర్బీ అహ్మదాబాద్- www.rrbahmedabad.gov.in
ఆర్ఆర్బీ అల్లహాబాద్- www.rrbald.gov.in
ఆర్ఆర్బీ భోపాల్- www.rrbbpl.nic.in
ఆర్ఆర్బీ భువనేశ్వర్- www.rrbbbs.gov.in
ఆర్ఆర్బీ బిలాస్పూర్- www.rrbbilaspur.gov.in
ఆర్ఆర్బీ ఛండీగఢ్- www.rrbcdg.gov.in
ఆర్ఆర్బీ చెన్నై- www.rrbchennai.gov.in
ఆర్ఆర్బీ గోరఖ్‌పూర్ - www.rrbgkp.gov.in
ఆర్ఆర్బీ గౌహతీ - www.rrbguwahati.gov.in
ఆర్ఆర్బీ జమ్ము- www.rrbjammu.nic.in
ఆర్ఆర్బీ కోల్‌కతా - www.rrbkolkata.gov.in
ఆర్ఆర్బీ మాల్డా - www.rrbmalda.gov.in
ఆర్ఆర్బీ ముంబై - www.rrbmumbai.gov.in
ఆర్ఆర్బీ ముజాఫర్పూర్ - www.rrbmuzaffarpur.gov.in
ఆర్ఆర్బీ పట్నా - www.rrbpatna.gov.in
ఆర్ఆర్బీ రాంచీ - www.rrbranchi.gov.in
సంబంధిత కథనం