ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ 2025 తేదీలను వెల్లడించిన బోర్డు.. ఇక్కడ తెలుసుకోండి-rrb ntpc exam 2025 dates out for graduate level posts check dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ 2025 తేదీలను వెల్లడించిన బోర్డు.. ఇక్కడ తెలుసుకోండి

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ 2025 తేదీలను వెల్లడించిన బోర్డు.. ఇక్కడ తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఆర్ఆర్‌బీ నిర్వహించనున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ 2025 తేదీలు విడుదలయ్యాయి. అధికారిక నోటీసును ఇక్కడ చూడొచ్చు.

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష తేదీల వెల్లడి (Rajkumar)

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ఎన్టీపీసీ ఎగ్జామ్ 2025 తేదీలను మే 13, 2025న విడుదల చేసింది. ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) ల (గ్రాడ్యుయేట్) కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు సీబీటీ 1 పరీక్ష తేదీల నోటిఫికేషన్‌ను ప్రాంతీయ ఆర్ఆర్‌బీల అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1ను జూన్ 5 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. సీబీటీ 1 పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. జనరల్ అవేర్ నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 30 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.

మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. పైన పేర్కొన్న నియామక దశల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ సిటీ, తేదీ, ట్రావెల్ అథారిటీ డౌన్లోడ్ కోసం లింక్ అన్ని ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్సైట్లలో పరీక్ష తేదీకి 10 రోజుల ముందు అందుబాటులోకి వస్తుంది. ఎగ్జామ్ సిటీ, డేట్ ఇన్ఫర్మేషన్ లింక్ లో పేర్కొన్న పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ-కాల్ లెటర్స్ ప్రారంభమవుతాయి.

ఆర్ఆర్‌బీ 8113 గ్రాడ్యుయేట్ స్థాయి ఎన్టీపీసీ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1736 ఖాళీలు, స్టేషన్ మాస్టర్ 994 ఖాళీలు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144 ఖాళీలు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507 ఖాళీలు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 732 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.