RRB Group D Posts : ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిక్రూట్‌మెంట్.. 32,438 పోస్టులకు నోటిఫికేషన్
RRB Group D Posts : ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తాజా నోటిఫికేషన్ వెళ్లండైది. మెుత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు.. RRB CEN నంబర్ 08/2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో మొత్తం 32,438 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 23, 2025న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2025గా నిర్ణయించారు. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు.
32000కి పైగా రైల్వే గ్రూప్ డి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందు ఆర్ఆర్‌బీ ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో వయోపరిమితి కచ్చితమైన ఖాళీల సంఖ్యను మార్చడంపై సమాచారం ఇచ్చారు. 01 జనవరి 2025 నుండి వయస్సు లెక్కించనున్నట్టుగా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందు షార్ట్ నోటీసులో 01 జూలై 2025 నుండి వయస్సును లెక్కిస్తామని చెప్పారు. తాజా నోటిఫికేషన్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీ (లెవల్-1) ఖాళీల సంఖ్యను 32438గా పేర్కొన్నారు. గతంలో 32 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
అర్హతలు
32438 రైల్వే గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 22. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. టెన్త్ పాసైన అభ్యర్థులు గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డీ జాబ్ అభ్యర్థులకు ఇకపై ఐటీఐ డిప్లొమా తప్పనిసరి కాదు. టెక్నికల్ డిపార్ట్మెంట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) ఇచ్చిన న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా తప్పనిసరిగా ఉండాలి. న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేరు.
గ్రూప్ డీ పోస్టులు
అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ), అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ పీవీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్), అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఆర్ డీ, పాయింట్స్ మెన్ బీ ట్రాక్ మేనేజర్-4.
దరఖాస్తు ఫీజు
జనరల్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500 (సీబీటీకి హాజరైనందుకు రూ.400 రీఫండ్ చేస్తారు), ఎస్సీ/ ఎస్టీ/ ఈబీసీ/ ఉమెన్/ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ.250 (సీబీటీకి హాజరైన తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు).