RITES Recruitment : ఆర్ఐటీఈఎస్ జాబ్స్.. 170 ప్రొఫెషనల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్-rites recruitment 2025 application for 170 professional posts know in details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Rites Recruitment : ఆర్ఐటీఈఎస్ జాబ్స్.. 170 ప్రొఫెషనల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్

RITES Recruitment : ఆర్ఐటీఈఎస్ జాబ్స్.. 170 ప్రొఫెషనల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్

Anand Sai HT Telugu

RITES Recruitment : RITES లిమిటెడ్‌లో ఖాళీలు వెలువడ్డాయి. ప్రొఫెషనల్స్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. చివరి తేదీ కూడా దగ్గర పడుతోంది.

ఆర్ఐటీఈఎస్ జాబ్స్ (Unsplash)

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) 170 ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో 20 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్‌తో సహా వివిధ విభాగాలకు జరుగుతున్నాయి.

ఈ నియామకంలో సాంకేతిక, నిర్వహణ రంగాలలో అనేక పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి ఇతర విభాగాలలోని పోస్టులు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని పోస్టులు కెమికల్ ఇంజనీరింగ్‌లో రిజర్వ్ అయ్యాయి. అయితే ఇతర సాంకేతిక స్పెషలైజేషన్ల ఆధారంగా కూడా ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు

ఈ నియామకానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ(లేదా తత్సమాన అర్హత) కలిగి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 65శాతం మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBDలకు 55శాతం మార్కులు పెట్టారు. అలాగే అభ్యర్థులు అధికారిక నియామక నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలి.

చివరి తేదీ ఎప్పుడంటే

RITES జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు rites.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20, 2025గా నిర్ణయించారు. ఈ తేదీ తర్వాత ఎటువంటి దరఖాస్తు అంగీకరించరు. అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ఫారమ్‌ను సకాలంలో నింపాలి.

దరఖాస్తు ఫారంలో ఏదైనా తప్పులు ఉంటే, దరఖాస్తు తీసుకోరు. అభ్యర్థులు అన్ని వివరాలను జాగ్రత్తగా పూరించాలి. దీనితో పాటు, వారు అవసరమైన పత్రాలను సరైన రూపంలో అప్‌లోడ్ చేయాలి.

ఇలా అప్లై చేయండి

RITES రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rites.com ని సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న RITES రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అవసరమైన వివరాలను పూరించాలి. దీని తరువాత వారు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్‌ను తీసుకోండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్