తెలుగు న్యూస్ / career /
OU PhD Entrance Test 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - మారిన షెడ్యూల్, కొత్త తేదీలివే
OU PhD Entrance Notification 2025 Updates : ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ లో పలు మార్పులు చేశారు. జనవరి 30వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. www.osmania.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఓయూ పీహెచ్డీ అడ్మిషన్లు 2025
ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఈ మేరకు మరో షెడ్యూల్ ను ప్రకటించారు. జనవరి 30వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
జనవరి 30 నుంచి దరఖాస్తులు ప్రారంభం…
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... జనవరి 24వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెబ్ సైట్ లో ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ అందుబాటులోకి రాలేదు. అయితే తాజాగా రీవైజెడ్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. జనవరి 30వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్య వివరాలు:
- పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి.
- ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- జాతీయ స్థాయిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ నెట్ , సిఎస్‌ఐఆర్, ఐసిఎంఆర్, డిబిటి, ఇన్స్పైర్ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారు కూడా ఎంట్రన్స్ ద్వారానే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్ పరీక్ష ఇంగ్లీష్ భాషలోనే నిర్వహిస్తారు.
- అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.
- రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2000చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1500గా నిర్ణయించారు. ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో యూనివర్శిటీ వెబ్‌సైట్ www.ouadmissions.com ద్వారా చేయాల్సి ఉంటుంది.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 30 జనవరి 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 1 మార్చి 2025
- రూ. 2వేల ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 11 మార్చి 2025.
- సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను యూనివర్శిటీ https://www.osmania.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మార్చి చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ouadmissions.com/
సంబంధిత కథనం