Central Bank of India : రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్- రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్..
Central Bank of India recruitment : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ఖాళీల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 12 న ముగించనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పోస్టులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు centralbankofindia.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఓ రిక్రూట్మెంట్ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 62 ఖాళీలను భర్తీ చేయనుంది ఈ ప్రముఖ బ్యాంక్.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఓ రిక్రూట్మెంట్ 2024: ఖాళీల వివరాలు
డేటా ఇంజినీర్/ అనలిస్ట్: 3 ఖాళీలు
డేటా సైంటిస్ట్: 2 ఖాళీలు
డేటా-ఆర్కిటెక్ట్/ క్యాడ్ ఆర్కిటెక్ట్/ డిజైనర్/ మోడలర్: 2 ఖాళీలు
ఎంఎల్ ఓపీఎస్ ఇంజినీర్: 2 ఖాళీలు
జనరల్ ఏఐ ఎక్స్పర్ట్స్ (లార్జ్ లాంగ్వేజ్ మోడల్): 2 ఖాళీలు
క్యాంపెయిన్ మేనేజర్ (ఎస్ఈఎం & ఎస్ఎమ్ఎం): 1 ఖాళీ
ఎస్ఈఓ స్పెషలిస్ట్: 1 ఖాళీ
గ్రాఫిక్ డిజైనర్ & వీడియో ఎడిటర్: 1 ఖాళీ
కంటెంట్ రైటర్ (డిజిటల్ మార్కెటింగ్): 1 ఖాళీ
మార్ టెక్ స్పెషలిస్ట్ : 1 ఖాళీ
నియో సపోర్ట్ రిక్వైర్మెంట్- ఎల్ 2: 6 ఖాళీలు
నియో సపోర్ట్ రిక్వైర్మెంట్- ఎల్ 1: 10 ఖాళీలు
ప్రొడక్షన్ సపోర్ట్ / టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ : 10 ఖాళీలు
డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్ : 10 ఖాళీలు
డెవలపర్ / డేటా సపోర్ట్ ఇంజినీర్ : 10 ఖాళీలు.
వివిధ పోస్టులకు సంబంధించిన వయసు, విద్యార్హత, ఎక్స్‌పీరియెన్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఓ రిక్రూట్మెంట్లో రాత పరీక్ష ఉండదు. అర్హులైన అభ్యర్థులను 2025 జనవరి నాలుగో వారంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ రౌండ్‌కు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు అర్హత మార్కులు జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం.
ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్ల క్రమంలోనే తుది ఎంపికకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 ప్లస్ జీఎస్టీ.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో రిక్రూట్మెంట్ పేజీని సందర్శించవచ్చు.
సంబంధిత కథనం