సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DMHO) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 117 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ పూర్తి చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 117 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 56 ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. ఆ తర్వాత ఎంఎల్‌హెచ్‌పీ ఖాళీలు అత్యధికంగా(17) ఉన్నాయి. ఈ కేటగిరిలో ఉన్న కొన్ని ఖాళీలకు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. మరికొన్ని పోస్టులకు జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. ఇవే కాకుండా… సపోర్టింగ్ స్టాఫ్ కింద పది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పీడీయాట్రీషియన్, మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, ఫార్మసిస్ట్స్, ఫిజీషియన్స్, డెంటల్ టెక్నీషియన్, బయోకెమిస్ట్, కంటిజెంట్ వర్కర్, అనస్థీషియా, సిటి రేడియోగ్రాఫర్ తో పాటు మరికొన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు కలిగి ఉండాలి. ఫార్మసీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీ ఫార్మసీ పాసై ఉండాలి.
ఈ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే అభ్యర్థులు https://sangareddy.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ ను పూర్తి చేయటంతో పాటు మీ విద్యార్హత పత్రాలను ఇందుకు జత చేయాలి. ఈ దరఖాస్తు ఫామ్ ను డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి జిల్లా చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా స్వయంగానైనా అందించవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు మే 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపు చేరిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే వాటిని తిరస్కరిస్తారు. ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుంది.