AP Medical College Recruitment : పాడేరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 244 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు తేదీలివే
Govt Medical College Paderu Jobs: పాడేరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి జనవరి 10వ తేదిని గడువుగా నిర్ణయించారు. వీటిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతుల్లో భర్తీ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) పరిధిలో 12 కేటగిరీల్లో 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అంతేకాకుండా… ప్రభుత్వ జనరల్ హాస్పటల్ (జీజీహెచ్) పరిధిలో 24 కేటగిరీల్లో 180 పోస్టులు మొత్తం 244 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 107 పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలోనూ… 137 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలోనూ భర్తీ చేస్తారు.
విభాగాలవారీగా ఖాళీలు ..జీతమెంత?
ప్రభుత్వ మెడికల్ కాలేజీ (జీఎంసీ)లో స్టోర్ కీపర్- 3 (రూ.18,500), ఆడియో విజువల్ టెక్నీషియన్- 1 (రూ.32,670), ఎలక్ట్రికల్ హెల్పర్-1 (రూ.15,000), జనరల్ డ్యూటీ అటెండెంట్-4 (రూ.15,000), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్-9 (రూ.18,500), ల్యాబ్ అటెండర్-9 (రూ.15,000), ల్యాబ్ టెక్నీషియన్-12 (రూ.32,670), లైబ్రరీ అసిస్టెంట్- 4 (రూ.20,000), మార్చురీ అటెండెంట్లు-6 (రూ.15,000), ఆఫీస్ సబార్డినేట్- 14 (రూ.15,000), ఫిజికల్ ఎడ్యూకేషన్ ట్రైనర్ (పీఈటీ)- 1 (రూ.40,970), ప్లంబర్-1 (రూ.15,000) ఖాళీలు ఉన్నాయి.
ఇక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ -3 (రూ.35,770), అనస్థీషియా టెక్నీషియన్ -10 (రూ.34,580), ఆడియోమెట్రీ టెక్నీషియన్ -1 (రూ.32,670), కార్డియాలజీ టెక్నీషియన్- 1 (రూ.37,640), చైల్డ్ సైకాలజిస్ట్-1 (రూ.54,060), క్లినికల్ సైకాలజిస్ట్- 1 (రూ.54,060), ఈజీజీ టెక్నీషియన్- 3 (రూ.32,670) పోస్టులున్నాయి.
ఎలక్ట్రికల్ హెల్పర్-2 (రూ.15,000), ఎలక్ట్రీషియన్ గ్రేడ్-III 4 (రూ.22,400), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్-35 (రూ.32,670), జనరల్ డ్యూటీ అటెండెంట్-58 (రూ.15,000), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్-17 (రూ.18,500), ల్యాబ్ అటెండర్-3 (రూ.15,000), ల్యాబ్ టెక్నీషియన్-7 (రూ.32,670), మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (ఎంఆర్‌టీ)-1 (రూ.34,580), ఆఫీస్ సబార్డినేట్- 14 (రూ.15,000), ఫార్మసిస్ట్ గ్రేడ్ II- 9 (32,670), ఫిజియోథెరపిస్ట్- 2 (రూ.32,670), ప్లంబర్లు - 2 (రూ.15,000), సైకియాట్రిక్ సోషల్ వర్కర్-2 (రూ.38720), రిఫ్రాక్షనిస్ట్-1 (రూ.37640), స్పీచ్ థెరపిస్ట్- 1 (రూ.40970), స్టోర్ అటెండర్- 4 (రూ.15,000) పోస్టులు భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ షెడ్యూల్
1. దరఖాస్తు దాఖలు : జనవరి 10 (సాయంత్రం 5 గంటల) వరకు. కేవలం ఆఫీస్ పని దినాల్లోనే.
2. దరఖాస్తులు పరిశీలన : జనవరి 11 నుండి జనవరి 31 వరకు, 2025
3. మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 1, 2025
4. మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులు చేసేందుకు : ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు, 2025
5. ఫిర్యాదులను పరిష్కరించడం : ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 7 వరకు, 2025
6. తుడి మెరిట్ లిస్ట్ విడుదల : ఫిబ్రవరి 8, 2025
7. ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల : ఫిబ్రవరి 13, 2025
8. తుది ఎంపిక జాబితా విడుదల : ఫిబ్రవరి 17, 2025
9. కౌన్సిలింగ్ అండ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేత: ఫిబ్రవరి 20, 2025
2024 జులై 1 వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. అప్లికేషన్ ఫీజు బీసీ అభ్యర్థులకు రూ.100, ఓసీ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు ఫారమ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://gmcpaderu.com/admin/upload/NOTIFICATION%20GMC%20PADERU.pdf అందుబాటులో ఉంటుంది. ఇక్కడ్నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని.. పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలతో కూడిన ఒక జిరాక్స్ కాపీ సెట్‌పై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. ఆ దరఖాస్తు సెట్‌ను ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాడేరు, అల్లూరి సీతారామరాజు కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో జనవరి 10 తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. అదనపు వివరాలు (అర్హతలు, రిజర్వేషన్లు తదితర అంశాల గురించి)కు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://gmcpaderu.com/admin/upload/NOTIFICATION%20GMC%20PADERU.pdf సంప్రదిచాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం