NIRDPR Jobs : రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్ లో 11 ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?
NIRDPR Jobs : రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్ లో ఒప్పంద ప్రాతిపదికన 11 అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Hyderabad NIRDPR Jobs : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.2,50,000 వేతనం చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు వయోపరిమితి నిర్ణయించారు.
ఖాళీలు
- అసోసియేట్ ప్రొఫెసర్- 02
- అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 09
ముఖ్యాంశాలు
1. అభ్యర్థులు http://career.nirdpr.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2. ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. భవిష్యత్తులో NIRDPRలో ఏ విధమైన రెగ్యులర్ అపాయింట్‌మెంట్ అందించరు.
3. తరచుగా అధికారిక పర్యటనలు, బయట ప్రాంతాల్లో అసైన్‌మెంట్‌లకు సిద్ధపడి ఉండాలి.
4. అర్హులైన అభ్యర్థులకు అధిక జీతం మంజూరు చేయవచ్చు.
5. SC/ST/PWD కేటగిరీ కింద దరఖాస్తు రుసుము మినహాయింపు కోరుకునే అభ్యర్థులు అవసరమైన కులం/PWD కేటగిరీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరిస్తారు.
6. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుమును పే ఫీజు (SBI కలెక్ట్) ద్వారా చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అవసరం లేదు.
7. వయస్సు, ఉద్యోగ అనుభవం, అర్హత 16.02.2025 నాటికి లెక్కిస్తారు. అన్ని ముఖ్యమైన సర్టిఫికెట్ల ఫోటోస్టాట్ కాపీలను ఆన్‌లైన్ దరఖాస్తుతో అప్‌లోడ్ చేయాలి.
8. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తే ఇనిస్టిట్యూట్ అవసరమైన విధంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయవచ్చు.
9. రాత పరీక్ష/లేదా ఇంటర్వ్యూ తేదీ, షార్ట్‌లిస్ట్ అభ్యర్థులకు మాత్రమే తెలియజేస్తారు.
10. అభ్యర్థులు మరిన్ని సమాచారం/అప్‌డేట్‌ల కోసం NIRDPR వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించవచ్చు.
11. ఆన్‌లైన్ దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ 16.02.2025.