సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్.. టెన్త్ పాసై ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు
Railway Recruitment : రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
10వ తరగతి ఉత్తీర్ణులై మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందవచ్చు. దక్షిణ మధ్య రైల్వే 4232 అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 27 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ scr.indianrailways.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ కింద వివిధ ట్రేడ్‌లలో నియామకాలు జరుగుతాయి. వీటిలో ప్రధానంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, ఏసీ మెకానిక్, పెయింటర్, ఇతర ట్రేడ్‌లు ఉన్నాయి. అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం, అభ్యర్థులు జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . అయితే SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు మెరిట్ జాబితా ఆధారంగా షార్ట్ లిస్ట్ అవుతారు. ఎడ్యుకేషన్, ట్రెడ్ సంబంధిత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. దరఖాస్తుదారులు అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని చూసుకోని అప్లై చేయండి.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అభ్యర్థులందరూ అధికారిక సైట్ scr.indianrailways.gov.inకి వెళ్లండి.
హోమ్ పేజీలో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్త రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోండి.
లాగిన్ చేయడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
దీని తర్వాత దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయండి.
ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించండి.
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకొవాలి.