జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - జీతం రూ. 35 వేలు, ముఖ్య వివరాలివే-professor jayashankar telangana state agricultural university recruitment notification for assistant wardens ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - జీతం రూ. 35 వేలు, ముఖ్య వివరాలివే

జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - జీతం రూ. 35 వేలు, ముఖ్య వివరాలివే

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 20 అసిస్టెంట్ వార్డెన్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. www.pjtau.edu.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే రిక్రూట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం
  • ఉద్యోగాల పేరు - అసిస్టెంట్ వార్డెన్స్.
  • మొత్తం ఖాళీలు - 20 (10 మంది మహిళా అభ్యర్థులు, 10 మంది పురుషులు).
  • అర్హతలు - ఎంఏ సోషియాలజీ లేదా ఎంఏ సోషల్ వర్క్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హానర్స్(కమ్యూనిటీ సైన్స్).
  • రిక్రూట్ మెంట్ విధానం - ఇంటర్వ్యూల ద్వారా
  • పని చేయాల్సిన ప్రాంతాలు - రాజేంద్రనగర్, హైదరాబాద్, అశ్వరావుపేట, జగిత్యాల, పాలెం, వరంగల్, సిరిసిల్ల, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
  • నెల జీతం - రూ. 35 వేలు
  • పని సమయాలు - ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10.30 గంటలు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
  • ఇంటర్వ్యూ తేదీ - జూన్ 20, 2025(సమయం ఉదయం 10 గంటలు)
  • ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం -నాల్డెజ్ మేనేజ్మెంట్ సెంటర్, పీజేటీఏయూ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
  • ఇంటర్వ్యులకు వచ్చే అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలు తీసుకురావాలి. ధ్రువపత్రాలను జిరాక్స్ తీసుకుని అటెస్ట్ చేయించుకోవాలి. వీటితో పాటుఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు కాపీలు ఉండాలి.
  • అప్లికేషన్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఉండాలి.
  • అధికారిక వెబ్ సైట్ లింక్ - https://www.pjtau.edu.in/index.html

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.