Student loan : ఆస్ట్రేలియాలో చదువు కోసం సులభంగా లోన్​- ప్రాడిగీ ఫైనాన్స్​తో మీ కలల్ని నిజం చేసుకోండి..-prodigy finance offers no collateral loans for studying in australia ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Student Loan : ఆస్ట్రేలియాలో చదువు కోసం సులభంగా లోన్​- ప్రాడిగీ ఫైనాన్స్​తో మీ కలల్ని నిజం చేసుకోండి..

Student loan : ఆస్ట్రేలియాలో చదువు కోసం సులభంగా లోన్​- ప్రాడిగీ ఫైనాన్స్​తో మీ కలల్ని నిజం చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Dec 09, 2024 11:24 AM IST

Prodigy Finance : ఆస్ట్రేలియాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ప్రాడిగీ ఫైనాన్స్​ గురించి తెలుసుకోవాలి! కో- సైనర్​ లేకుండానే, పోటీ వడ్డీ రేట్లకు సులభంగా లోన్​ ఇస్తోంది ఈ సంస్థ.

ఆస్ట్రేలియాలో చదువు కోసం సులభంగా లోన్
ఆస్ట్రేలియాలో చదువు కోసం సులభంగా లోన్

విదేశాల్లో చదువుల కోసం ప్రతి యేటా లక్షలాది మంది భారతీయులు విమానాలు ఎక్కుతున్నారు. వీరిలో చాలా మంది ఆస్ట్రేలియాకు వెళుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే పోటీ ధరకు నాణ్యమైన విద్య దొరుకుతుండటం ఇందుకు కారణం. మీరూ ఆస్ట్రేలియాకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే ప్రముఖ ఇంటర్నేషనల్​ స్టూడెంట్​ లెండర్​ ప్రాడిగీ ఫైనాన్స్​ మీకు పూర్తి సాయం చేస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు పడకుండా స్టూడెంట్​ లోన్స్​ ఇస్తుంది.

yearly horoscope entry point

ఆస్ట్రేలియాలో చదువు కోసం..

ఆస్ట్రేలియాలోని టాప్​ 42 విశ్వవిద్యాలయాలకు మంచి డిమాండ్​ ఉంది. అక్కడికి వెళ్లే విదేశీ విద్యార్థులు ఇంజినీరింగ్​, ఐటీ, బిజినెస్​ మేనేజ్​మెంట్​, హెల్త్​ సైన్సెస్​తో పాటు 1,100కి పైగా సంస్థల్లో 22వేలకు పైగా కోర్సుల్లో చేరుతున్నారు. 2023లో మొత్తం మీద 7,93,335 మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాకు చదువు కోసం వెళ్లారు. ఇక మొనాశ్​ వర్సిటీ, ఆస్ట్రేలియన్​ నేషనల్​ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ సిడ్నీ వంటివి భారతీయుల ప్రధాన ఛాయిస్​లుగా నిలుస్తున్నాయి.

కానీ చాలా మందికి ఆస్ట్రేలియాలో చదువు కోసం ఏం చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది? వంటి వాటిపై సరైన స్పష్టత ఉండదు. ఇలాంటి వారికి ప్రాడిగీ ఫైనాన్స్​ ప్రత్యేక మద్దతు ఇస్తుంది. ఆస్ట్రేలియాలోని టాప్​ వర్సిటీల్లో ఇంజినీరింగ్​, ఐటీ, బిజినెస్​తో పాటు ఇతర కోర్సులకు సపోర్ట్​ చేస్తుంది. కొలాటర్​ లేకుండా, కో-సైనర్​ లేకుండా పోటీ వడ్డీ రేట్లకే స్టూడెంట్​ లోన్​ ఇస్తుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా విద్యార్థులు చదువుకోవచ్చు.

"విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీలు కీలక గమ్యస్థానాలుగా మారాయి. ప్రతియేటా ఎన్​రోల్​మెంట్​ నెంబర్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రాడిగీ ఫైనాన్స్​లో మము విద్యార్థులకు అండగా ఉంటాము. ఆస్ట్రేలియాలో అద్భుతమైన చదువు అవకాశాలకు మేము సాయం చేస్తాము. 18కిపైగా వర్సిటీలతో మాకు ఎక్స్​క్లూజివ్​ పార్ట్​నర్​షిప్​ ఉంది. మరిన్నింటితో త్వరలోనే కనెక్ట్​ అవుతాము," అని ప్రాడిగీ ఫైనాన్స్​ చీఫ్​ కమర్షియల్​ ఆ ఫీసర్​ సోనల్​ కపూర్​ తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులు, క్రెడిట్​ హిస్టరీ కాకుండా భవిష్యత్తులో విద్యార్థులు సంపాదించే సామర్థ్యం ఆధారంగా ప్రాడిగీ రుణాలు ఇస్తుంది. 2007లో స్థాపించిన ఈ సంస్థ..ఇప్పటివరకు 43వేలకుపైగా మంది విదేశీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్​ వర్సిటీల్లో చదువుకునేందుకు సాయం చేసింది. ఇప్పటివరకు 150కిపైగా దేశాల్లోని విద్యార్థుల కోసం 2.3 బిలియన్​ డాలర్లను ఫండ్​ చేసింది ప్రాడిగీ ఫైనాన్స్​. ఈ సంస్థ యూకేలోని ఫైనాన్స్​ కాండక్ట్​ ఆథారిటీ రెగ్యులేషన్​ పరిధిలోకి వస్తుంది.

2025లో విదేశీ విద్యార్థుల సంఖ్యను 2,70,000కి తగ్గించాలని ఆస్ట్రేలియా భావిస్తున్నప్పటికీ.. సరైన ప్లానింగ్​- రీసెర్చ్​, ఖర్చులపై అవగాహన వంటి అంశాలతో ఆస్ట్రేలియాలో చదువు కోసం ముందడుగు వేయవచ్చని ప్రాడిగీ ఫైనాన్స్​ చెబుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం