TG District Courts Recruitment 2025 : తెలంగాణ కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు - 10 తరగతి అర్హత, పూర్తి వివరాలివే
తెలంగాణలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో టెన్త్ క్లాస్ అర్హతతో ప్రాసెస్ సర్వర్ ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు జనవరి 31వ తేదీతో పూర్తవుతుంది. https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.
తెలంగాణలో జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇటీవలనే హైకోర్టు నుంచి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈనెల 8వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో 10 తరగతి అర్హతతోనే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలను కూడా రిక్రూట్ చేస్తున్నారు. అన్ని కోర్టుల్లో కలిపి 130 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా నోటిఫికేషన్ లో ప్రకటించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు జనవరి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టును అనుసరించి రూ.22,900 నుంచి రూ.69,150 వరకు పే స్కేల్ వర్తిస్తుంది.
పరీక్ష విధానం…
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 45 మార్కులకు రాత పరీక్ష ఉంటే.. మరో 5 మార్కులు ఇంటర్వుకు కేటాయిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. 45 మార్కుల్లో 30 క్వశ్చన్స్ జనరల్ నాల్డెజ్ నుంచి వస్తాయి. మరో 15 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకునే ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ , ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక భాష వచ్చి ఉండాలి. https://tshc.gov.in/s వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తుల గడువు 31 జనవరి 2025తో పూర్తవుతుంది. రాత పరీక్షలు ఏప్రిల్ 2025లో నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఐదు మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
- అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
- పార్ట్ ఏలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఆ తర్వాత పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటాన్నారో దానిపై క్లిక్ చేయాలి.
- నిర్ణయించిన రుసుం చెల్లించాలి. వివరాల పూర్తి తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను భద్రపర్చుకోవాలి. హాల్ టికెట్ల జారీలో ఉపయోగపడుతుంది.
ఈ కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. మొత్తం1,673 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పోస్టుల్లో భాగంగానే… ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలను కూడా భరీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 1673 ఉండగా… టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత కథనం