తెలుగు న్యూస్ / career /
Prasar Bharati Hyderabad : ప్రసార భారతిలో సీనియర్ కరస్పాండెంట్ ఖాళీలు - భారీగా జీతం, వివరాలివే
Prasar Bharati Recruitment 2025 : ప్రసార భారతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కేంద్రంలో సీనియర్ కరస్పాడెంట్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు జనవరి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రసార భారతి ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న పలు ఖాళీల భర్తీ కోసం ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రాంతీయ కేంద్రంలో సీనియర్ కరస్పాడెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ముఖ్య వివరాలు
- కేటగిరి - సీనియర్ కరస్పాడెంట్
- ఉద్యోగ ఖాళీలు - 01
- పని చేసే ప్రదేశం - హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
- ఎంపికైన వారు రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది.
- జీతం నెలకు రూ. 80 వేల నుంచి 1,25,000 వరకు చెల్లిస్తారు.
- డిగ్రీ లేదా పీజీ డిప్లోమా ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి ఉండాలి.
- స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
- సంబంధింత విభాగంలో ఐదేళ్లపాటు పని చేసిని అనుభవం ఉండాలి.
- 45 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు.
- అర్హులన వారు జనవరి 31, 2025లోపు పంపాలి.
- దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
- ఏమైనా సందేహాలు ఉంటే hrcell413@gmail.comను సంప్రదించవచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://prasarbharati.gov.in/
- ఈ పోస్టులకు ఎంపికైన వారు…న్యూస్ రిపోర్టింగ్, స్టోరీస్, న్యూస్ రూమ్ కు సంబంధించిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కేంద్రాల్లోనూ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో సీనియర్ కరస్పాడెంట్ పోస్టులతో పాటు స్టీంగర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ వివరాల కోసం https://prasarbharati.gov.in/pbvacancies/ లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం