సీబీఎస్ఈ ఫలితాల్లో సరైన స్కోర్ సాధించని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ-pm modi to students as cbse declares class 10 12 results one result cant ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్ఈ ఫలితాల్లో సరైన స్కోర్ సాధించని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ

సీబీఎస్ఈ ఫలితాల్లో సరైన స్కోర్ సాధించని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ

Sudarshan V HT Telugu

సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు పోషించిన పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు.

ప్రధాని మోదీ (PTI)

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఆశించిన స్కోర్ రాని కారణంగా నిరుత్సాహానికి గురైన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ‘‘ఒకే ఒక్క పరీక్ష వారి విలువను నిర్ణయించదని, వారి నిజమైన సామర్థ్యాలు వారి మార్క్ షీట్లకు మించి విస్తరించి ఉంటాయి’’ అని ఆయన నొక్కి చెప్పారు.

విజేతలకు అభినందనలు

'సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషి ఫలితమే' అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' లో ప్రధాని మోదీ పోస్టు చేశారు. ఈ ఘనతకు దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరుల పాత్రను గుర్తించాల్సిన రోజు కూడా ఈ రోజు అని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే అన్ని పరీక్షల్లో ఎగ్జామ్ వారియర్స్ గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఒక ఫలితంతో ఏమీ తేలదు

సీబీఎస్ 10 వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సరైన స్కోర్ సాధించని వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ వారిలో స్ఫూర్తి నింపేలా వ్యాఖ్యానించారు. "ఆశించిన స్కోర్ రాలేదని కొద్దిగా నిరాశకు గురైనవారికి, నేను వారికి చెప్పాలనుకుంటున్నాను: ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించదు. మీ ప్రయాణం చాలా పెద్దది. మీ సామర్ధ్యాలు మార్క్ షీట్ ను మించి ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆసక్తిగా ఉండండి, ఎందుకంటే గొప్ప విషయాలు వేచి ఉన్నాయి. #ExamWarriors" అని ప్రధాని తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.

బాలికల పై చేయి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం 10, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతి, 12వ తరగతిలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 12వ తరగతిలో బాలికలు 91 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర కంటే 5.94 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా పదో తరగతిలో 95 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలుర కంటే 2.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ ఈ గణాంకాలను అధికారిక పత్రికా ప్రకటనలో పంచుకుంది. ఈ ఏడాది 93 శాతానికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం