PM Internship : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? లాస్ట్ ఛాన్స్-pm internship scheme 2025 registration ends today know how to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Pm Internship : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? లాస్ట్ ఛాన్స్

PM Internship : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? లాస్ట్ ఛాన్స్

Anand Sai HT Telugu

Prime Minister Internship Scheme 2025: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024-25 రెండో దశ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు pminternship.mca.gov.in వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

PM Internship Scheme Portal

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ 2025 రెండో దశ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే, pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. లేదంటే ఇంటర్న్‌షిప్ పొందే సువర్ణావకాశం మీ చేతుల్లోంచి పోతుంది. పీఎం ఇంటర్న్‌షిప్ రెండో దశలో మొత్తం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో దరఖాస్తుకు చివరి తేదీ 12 మార్చి 2025 కాగా ఆ తర్వాత 2025 మార్చి 31 వరకు పొడిగించారు.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025కు ఎలా అప్లై చేయాలి

1. ముందుగా అభ్యర్థి pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సై‌ట్‌కు వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.

3. దీని తరువాత మీరు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

4. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్‌తోపాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.

5. దీని తరువాత మీరు మీ అప్లికేషన్ ఫామ్‌ను తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.

6. భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రిజిస్ట్రేషన్ లింక్

అర్హతలు

21-24 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ యువత ఎటువంటి పూర్తికాల ఉద్యోగం లేదా విద్యలో ఉండకూడదు. 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్, యూజీ/పీజీ ఉత్తీర్ణత ఉండి.. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం 8 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తే అలాంటి కుటుంబానికి చెందిన యువకులు అనర్హులు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఐటీ, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ చేసినవారు ఇందులో దరఖాస్తు చేయలేరు. సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ లేదా ఉన్నత చదువులు చదివినవారు దీనికి దరఖాస్తు చేయలేరు. ఏదైనా ప్రభుత్వ పథకం కింద నైపుణ్య శిక్షణ పొందుతున్న యువత కూడా దీనిని సద్వినియోగం చేసుకోలేరు.

స్టైఫండ్ ఎంత?

అభ్యర్థికి ప్రతి నెలా ఐదు వేల రూపాయలు లభిస్తాయి, ఇందులో కేంద్ర ప్రభుత్వం 4500 రూపాయలు, సీఎస్ఆర్ ఫండ్ నుండి 500 రూపాయలు ఇస్తుంది. దీంతోపాటు రూ.6వేలు ఏకమొత్తంగా ఇవ్వనున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్