TGPSC Group 2 Exams : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌.. కారణం ఇదే-petition in high court to postpone group 2 exams in telangana ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exams : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌.. కారణం ఇదే

TGPSC Group 2 Exams : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌.. కారణం ఇదే

Basani Shiva Kumar HT Telugu
Dec 09, 2024 01:53 PM IST

TGPSC Group 2 Exams : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

గ్రూప్ 2 పరీక్షలు
గ్రూప్ 2 పరీక్షలు

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష జరగనుంది, డిసెంబర్‌ 16, 17 తేదీల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్ష ఉంది. రెండు పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

yearly horoscope entry point

మరోవైపు తెలంగాణ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీ (ఇవాళ్టి నుంచి) గ్రూప్-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లతో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం సెషన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని స్పష్టం చేసింది. మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.

డిసెంబరు 16వ తేదీన పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.

హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి.

డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

Whats_app_banner