OU PhD Entrance Test 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తులు, ప్రాసెస్ ఇలా...-ou phd entrance test 2025 registration process has started key dates check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ou Phd Entrance Test 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తులు, ప్రాసెస్ ఇలా...

OU PhD Entrance Test 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తులు, ప్రాసెస్ ఇలా...

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2025 05:18 AM IST

OU PhD Entrance Notification 2025 Updates : ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 1వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. www.osmania.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ ప్రవేశాలు - 2025
ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ ప్రవేశాలు - 2025

ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 30వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

yearly horoscope entry point

పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

జాతీయ స్థాయిలో జూనియర్‌ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ నెట్ , సిఎస్‌ఐఆర్‌, ఐసిఎంఆర్‌, డిబిటి, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారు కూడా ఎంట్రన్స్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం ఇలా...

  1. పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్టుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే PhD Entrance Test 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ముందుగా Application Fee Payment పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  4. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.
  5. చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.2000చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1500గా నిర్ణయించారు. ఎంట్రెన్స్‌ పరీక్షకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో యూనివర్శిటీ వెబ్‌సైట్‌ www.ouadmissions.com ద్వారా చేయాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు:

  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 30 జనవరి 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 1 మార్చి 2025
  • రూ. 2వేల ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 11 మార్చి 2025.
  • మార్చి చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.ouadmissions.com/

ఈ లింక్ పై క్లిక్ చేసి పీహెచ్డీ అప్లికేషన్ ఫామ్ ను పొందవచ్చు…

Whats_app_banner

సంబంధిత కథనం