ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. మొత్తం ఈ పరీక్షలకు…. 9,747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,907 మంది పరీక్షలకు హాజరు కాగా…. ఉత్తీర్ణత శాతం 62.60 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరీక్షలను ఏప్రిల్ 25 నుంచి 27 వరకు నిర్వహించారు. మొత్తం 49 విభాగాల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ర్యాంకులతో పాటు ఇంటర్వ్యూల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.