OU PhD Entrance Test Dates 2025 : ఓయూ పీహెచ్డీ ప్రవేశాల అప్డేట్స్ - పరీక్షల షెడ్యూల్ విడుదల-ou phd 2025entrance examination schedule out key dates check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ou Phd Entrance Test Dates 2025 : ఓయూ పీహెచ్డీ ప్రవేశాల అప్డేట్స్ - పరీక్షల షెడ్యూల్ విడుదల

OU PhD Entrance Test Dates 2025 : ఓయూ పీహెచ్డీ ప్రవేశాల అప్డేట్స్ - పరీక్షల షెడ్యూల్ విడుదల

OU PhD Entrance Test 2025 Updates : ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 27వ తేదీతో ముగుస్తాయని పేర్కొన్నారు.

ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు 2025

ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా… పరీక్షల తేదీలతో పాటు షెడ్యూల్ వివరాలను ప్రకటించారు.

ఏప్రిల్ 25 నుంచి ఎగ్జామ్స్

ఓయూ పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ ముగుస్తాయని తేజా ప్రకటనలో పేర్కొన్నారు. ఎంట్రెన్స్ టెస్ట్ కోసం కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రతిరోజూ మూడు సెషన్లు ఉంటాయి. ఉదయం సెషన్ 09.30 AM నుంచి 11.00 గంటల మధ్య ఉంటుంది. ఇక రెండో సెషన్ 12.30 PM to 02.00 గంటల వరకు, మూడో సెషన్ 03.30 PM to 05.00 గంటల మధ్య నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.

అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లతో పాటు మరిన్ని వివరాల కోసం www.osmania.ac.in లేదా www.ouadmissions వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఒరియంటల్ లాంగ్వేజేస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్, లా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మెటిక్స్ డిపార్ట్ మెంట్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా డిపార్ట్ మెంట్లలో ఉండే కోర్సుల వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.

సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్ష సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్ కాపీలను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్టుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Syllabus లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. సబ్జెక్టుల వారీగా పేర్లు డిస్ ప్లే అవుతాయి.
  4. మీరు ఏ సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకున్నారో అక్కడ క్లిక్ చేయాలి.
  5. క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి సిలబస్ కాపీని పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి పరీక్షల షెడ్యూల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు…

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం