ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 1 కింద అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… తాజాగా అధికారులు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.
అన్ని కలిపి 28 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం. డిగ్రీ మూడేళ్లు, పీజీ రెండేళ్ల వ్యవధి ఉంటుంది. సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.
అభ్యర్థులు ఓయూ దూర విద్య అధికారిక వెబ్ సైట్ http://www.oucde.net/notifications.php లోకి వెళ్లాలి. ఆన్ లైన్ అడ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి.
ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి. కోర్సును బట్టి ఫీజును నిర్ణయించారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కోర్సుల వివరాలతో పాటు ఫీజులను తెలుసుకోవచ్చు. సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం