OU PhD Entrance Notification 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే-osmania university released schedule for the phd entrance test 2025 for category ii admissions ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ou Phd Entrance Notification 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

OU PhD Entrance Notification 2025 : ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 12, 2025 07:22 AM IST

Osmania University PhD Entrance Test 2025 : పీహెచ్డీ ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేటగిరి -2 కింద పలు కోర్సుల్లో ఈ అడ్మిషన్లు కల్పించనుంది. జనవరి 24వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఓయూలో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఓయూలో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎంట్రన్స్‌ టెస్ట్ ద్వారా ద్వారా అడ్మిషన్లను కల్పించనున్నారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఒరియంటల్ లాంగ్వేజేస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్, లా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మటిక్స్ డిపార్ట్ మెంట్ లో ప్రవేశాలు ఉంటాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆయా డిపార్ట్ మెంట్లలో ఉండే కోర్సుల వివరాలను ప్రకటించారు.

yearly horoscope entry point

పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

జాతీయ స్థాయిలో జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ నెట్ , సిఎస్‌ఐఆర్‌, ఐసిఎంఆర్‌, డిబిటి, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారు కూడా ఎంట్రన్స్‌ ద్వారానే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్స్ సబ్జెక్టులు తప్ప ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.

సిలబస్ లింక్….

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.2000చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1500గా నిర్ణయించారు. ఎంట్రన్స్‌ పరీక్షకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో యూనివర్శిటీ వెబ్‌సైట్‌ www.ouadmissions.com ద్వారా చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను యూనివర్శిటీ వెబ్‌సైట్‌ https://www.osmania.ac.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.

దరఖాస్తు తేదీలు…

జనవరి 24 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా అప్లై చేసుకొవచ్చు. రూ. 2000 లేట్ ఫీతో మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఏ ఏ సబ్జెక్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారాన్ని వెబ్ సైట్ లో పేర్కొనలేదు.

సబ్జెక్టుల వివరాలు….

ఆర్ట్స్‌ విభాగంలో హిస్టరీ-ఆర్కియాలజీ, ఇంగ్లీష్, లింగ్విస్టిక్స్‌, పర్సి‍యన్, ఫిలాసఫీ, సంస్కృతం, ఒరియంటల్ లాంగ్వేజెస్‌లో అరబిక్, తెలుగు భాషాల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఇక సోషల్‌ సైన్సెస్‌లో ఎకనామిక్స్‌, పొలిటికల్ సైన్సెస్‌, సోషల్ వర్క్‌, సోషియాలజీ సబ్జెక్టులు ఉంంటాయి. సైన్స్‌లో అప్లైడ్‌ జియో కెమిస్ట్రీ, అస్ట్రానమీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌, జెనిటిక్స్‌, జియాలజీ జియో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, స్టాటస్టిక్స్‌, జువాలజీ, కంప్యూటర్ సైన్స్‌ సబ్జెక్టులు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఇంజినీరింగ్‌లో బయో మెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెక్నాలజీ విభాగంలో కెమికల్ టెక్నాలజీ-కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం