OU Distance Education Admission : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - కొత్త నోటిఫికేషన్ విడుదల-osmania university distance education phase 2 admission notification released for february 2025 session ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ou Distance Education Admission : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - కొత్త నోటిఫికేషన్ విడుదల

OU Distance Education Admission : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - కొత్త నోటిఫికేషన్ విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 12, 2025 09:47 AM IST

ఉస్మానియా యూనివర్శిటీలో దూర విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. www.oucde.net వెబ్ సైట్ లోకి వెళ్లి కోర్సుల వివరాలు తెలుసుకోవటంతో పాటు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఓయూ దూర విద్యలో ప్రవేశాలు
ఓయూ దూర విద్యలో ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. 2024 - 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 2 కింద డిగ్రీ, పీజీ, అడ్వాన్స్ డిప్లోమా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లో ప్రకటనలో పేర్కొన్నారు.

సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో కోర్సుల నిర్వహణ జరుగుతుంది. మొత్తం 72 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 8886111690, 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

ముఖ్య వివరాలు:

  • అడ్మిషన్ల ప్రకటన - పీజీఆర్ఆర్సీడీఈ, ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాద్
  • కోర్సులు : ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు
  • కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం.
  • మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.
  • సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 31 మార్చి 2025
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు - 8886111690, 040-27097177, 040-27098350

దరఖాస్తు విధానం ఇలా….

  • అభ్యర్థులు ఓయూ దూర విద్య అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఆన్ లైన్ అడ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
  • ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు.
  • సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం