TG TET II Updates 2024 : తెలంగాణ టెట్ పరీక్షలు - అభ్యర్థులకు విద్యాశాఖ నుంచి మరో అప్డేట్..!
TG TET II Hall Ticket 2024 Download : తెలంగాణ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే హాల్ టికెట్లు విడుదల కాగా.. జనవరి 20వ తేదీ పరీక్ష రాసే అభ్యర్థులకు మాత్రం అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రాలేదు. అయితే వారంతా ఇవాళ్టి నుంచి విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కొంత మంది అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి రాలేదు. ఇదే విషయంపై విద్యాశాఖ ప్రకటన చేసింది.
ఇవాళ్టి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు…
సాంకేతిక కారణాలతో జనవరి 20వ తేదీన జరిగే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో రాలేదని తెలిపింది. ఆరోజు పరీక్ష రాసే అభ్యర్థులంతా కూడా ఇవాళ్టి(డిసెంబర్ 28, 2024) నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుందని పేర్కొంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
టెట్ హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే…?
- తెలంగాణ టెట్ అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ' Hall Tickets(II) Download 2024 ఆప్షన్ పై నొక్కాలి.
- జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకున్నారు. పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వివరాలు తెలుసుకోవచ్చు.