NTPC recruitment 2025 : నెలకు రూ. 1లక్ష జీతంతో ప్రభుత్వ ఉద్యోగం- ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ వివరాలు..
NTPC recruitment 2025 : నెలకు రూ. 1లక్ష జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తోంది ఎన్టీపీసీ. రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి సంబంధించిన అర్హత, వయస్సు పరిమితి వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్! నెలకు రూ. 1లక్ష జీతంతో కూడిన పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)లో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని సంస్థ హైర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025..
పోస్టుల వివరాలు : కమర్షియల్ కార్యకలాపాల కోసం సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను సంస్థ భర్తీ చేస్తోంది.
అప్లికేషన్ ప్రాసెస్ : ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025 అప్లికేషన్ ప్రక్రియ జనవరి 21న మొదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ : అప్లై చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ డిగ్రీ (కనీసం 60శాతం మార్కులు) ఉండాలి. పీజీడీఎం/ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
వర్క్ ఎక్స్‌పీరియెన్స్ : సంబంధిత ప్రొఫెషన్లో కనీసం 5ఏళ్ల ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.
వయస్సు పరిమితి : ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025కి అప్లై చేయాలని భావిస్తున్న అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 38ఏళ్లు మించకూడదు. అయితే రిజర్వ్డ్ కేటగిరీ వారికి వయస్సు పరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం- టెన్యూర్ : సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1లక్ష జీతం లభిస్తుంది. కాగా ఈ అపాయింట్మెంట్ 3ఏళ్లకు మాత్రమే. ఆ తర్వాత సదరు ఉద్యోగి ప్రదర్శన బట్టి దానిని మరో రెండేళ్లు పొడిగించవచ్చు.
అప్లికేషన్ ఫీజు : జెనరల్ కేటగిరీ వారికి రూ. 300
ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూడీబీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు రూ.0
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.
రైల్వే రిక్రూట్మెంట్ వివరాలు చూశారా..?
ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు rrcecr.gov.in రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా సంస్థలోని 1154 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 25న ప్రారంభమై ఫిబ్రవరి 14, 2025తో ముగుస్తుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం