నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 సెషన్ దరఖాస్తు ప్రక్రియను ముగించనుంది. మీరు కూడా దరఖాస్తు చేయాలనుకుంటే ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 12 మే 2025 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
దరఖాస్తు 2025 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఫీజును 2025 మే 13 (రాత్రి 11:59 గంటలు) వరకు పే చేయవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని సవరించడానికి కరెక్షన్ విండో మే 14 నుండి మే 15 (రాత్రి 11:59, 2025) వరకు తెరిచి ఉంటుంది.
జనరల్ కేటగిరీ- రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ- రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ- రూ.325
యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.(ఓబీసీ, నాన్ క్రీమీలేయర్/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు). నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు కూడా నెట్ రాయవచ్చు.
1. ముందుగా, అభ్యర్థి ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.
2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
4. అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు సబ్మిట్ చేయాలి.
6. కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో 85 సబ్జెక్టులకు యూజీసీ-నెట్ జూన్ 2025 నిర్వహించనుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువగా దరఖాస్తు ఫారమ్‌లను నింపితే తిరస్కరిస్తారు. అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని సూచనలు కచ్చితంగా పాటించాలి. ఏదైనా ఉంటే దరఖాస్తులో పేర్కొన్న ఇమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌కు సమాచారం ఇస్తారు.
యూజీసీ నెట్ పరీక్షకు దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు హెల్ప్‌లైన్ నంబర్లు-011-40759000, 011-69227700 కాల్ చేయవచ్చు. లేదంటే ఈ-మెయిల్ ugcnet@nta.ac.in సంప్రదించవచ్చు.