రెండు రోజుల్లో సీయూఈటీ యూజీ పరీక్ష ప్రారంభం- అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-nta releases cuet ug 2025 admit cards for may 13 16 exams direct link ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రెండు రోజుల్లో సీయూఈటీ యూజీ పరీక్ష ప్రారంభం- అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

రెండు రోజుల్లో సీయూఈటీ యూజీ పరీక్ష ప్రారంభం- అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

సీయూఈటీ యూజీ 2025 పరీక్ష త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సీయూఈటీ యూజీ 2025 (Unsplash)

మే 13 నుంచి 16 వరకు నిర్వహించే సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు cuet.nta.nic.in అధికారిక వెబ్సైట్​లోకి వెళ్లి అప్లికేషన్ నంబర్లు, పాస్​వర్డ్​లను ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

మిగిలిన పరీక్ష రోజులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సరైన సమయంలో విడుదల చేస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.

సీయూఈటీ యూజీ 2025కి సంబంధించి ఏజెన్సీ గతంలో ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఇది అభ్యర్థులకు వారి పరీక్షా కేంద్రాలు, పరీక్ష షెడ్యూల్ గురించి తెలియజేసింది.

ఇక సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్ కార్డులపై పరీక్ష కేంద్రం పేరు, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం, సూచనలు సహా ఇతర వివరాలు ఉంటాయి. పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

అడ్మిట్ కార్డుల్లో తప్పులుంటే అభ్యర్థులు వెంటనే సీయూఈటీ యూజీ కోసం ఏర్పాటు చేసిన ఎన్టీఏ హెల్ప్​లైన్​ నంబర్​ని సంప్రదించి తెలియజేయాలి.

సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోవాలి..

స్టెప్​ 1- సీయూఈటీ యూజీ కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్​ (cuet.nta.nic.in.)కి వెళ్లండి.

స్టెప్​ 2- అడ్మిట్ కార్డు/ఎగ్జామ్ సిటీ స్లిప్ లింక్ ఓపెన్ చేయాలి.

స్టెప్​ 3- మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి. సబ్మిట్​ ప్రెస్​ చేయండి.

స్టెప్​ 4- అడ్మిట్ కార్డు/ఎగ్జామ్ సిటీ స్లిప్​ డౌన్​లోడ్​ చేసుకోండి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో మే 13 నుంచి జూన్ 3, 2025 వరకు సీయూఈటీ యూజీ 2025 జరగనుంది. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు.

సీయూఈటీ యూజీ గురించి అభ్యర్థులకు సహాయం లేదా వివరణ అవసరమైతే, వారు ఎన్టీఏ హెల్ప్​లైన్స్​ 011-40759000 కు కాల్ చేయవచ్చు లేదా cuet-ug@nta.ac.in ఈమెయిల్ చేయవచ్చు.

సీయూఈటీ యూజీ అనేది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర భాగస్వామ్య సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు cuet.nta.nic.in, nta.ac.in అధికారిక ఎన్టీఏ వెబ్సైట్లను సందర్శించవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం