నీట్(యూజీ) పరీక్ష హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. దేశ వ్యాప్తంగామే 4న జరిగే నీట్ (యూజీ) పరీక్షకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు జారీ చేసింది. తాజాగా నీట్ అడ్మిట్ కార్డులు ఆన్ లైన్ లో విడుదల చేసింది. అభ్యర్థులు https://neet.nta.nic.in/admit-card-for-neetug-2025-is-live/ వైబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోనచ్చు.
విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 4న దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్లు 011-40759000/011-69227700 లేదా neetug2025@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం