AP Medical Recruitment 2025 : నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే
నెల్లూరు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 13 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసేందుకు ఫిబవరి 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. నెల్లూరు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్సిట్యూషన్స్‌లో పని చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేసే పోస్టులు…
మొత్తం 13 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో జనరల్ డ్యూటీ అటెండెంట్ -9, పోస్టుమార్టం అసిస్టెంట్ -3, బయో స్టాటిస్టిషియన్-1 భర్తీ చేస్తున్నారు.
జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుతో పాటు పోస్టుమార్టం అసిస్టెంట్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బయో స్టాటిస్టిషియన్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అయితే బీఏలో తప్పనిసరిగా మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ స్టాటస్టిక్స్‌లో ఉత్తీర్ణత సాధించినా అర్హులే అవుతారు.
2025 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 42 ఏళ్ల వరకు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీత భత్యాలు - దరఖాస్తు విధానం
1. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుకు రూ. 15,000
2. పోస్టుమార్టం అసిస్టెంట్ పోస్టుకు రూ.15,000
3. బయో స్టాటిస్టిషియన్ పోస్టుకు రూ.21,500
పూర్తి చేసిన దరఖాస్తును “డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర ఆఫ్ హాస్పటిల్ సర్వీస్ (డీఎస్‌హెచ్) కార్యాలయం, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ జూబ్లీ హాస్పటిల్, కూరగాయల మార్కెట్ దగ్గర , నెల్లూరు”లో సమర్పించాలి. ఫిబ్రవరి 20 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను కూడా జత చేయాలి. అప్లికేషన్ తో పాటు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి చూడొచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం