AP Health Department Jobs : అనంతపురం జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?
AP Health Department Jobs 2025: అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 29 ఖాళీలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతపురం జిల్లాలోని ఔట్ సోర్సింగ్ 29 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఏఏ పోస్టులు...జీతమెంత?
- జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఎఫ్ఎన్‌వో 18 పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆయా ఉద్యోగాలకు రూ.15,000 వేతనం ఉటుంది.
- ఎఫ్ఎన్‌వో 18 పోస్టులుః ఓసీ-7, ఓసీ (ఈడబ్ల్యూఎస్)-1, ఓసీ (స్పోర్ట్స్)-1, దివ్యాంగు-1, బీసీ-బీ-1, బీసీ-సీ-1, బీసీ-డీ-1, ఎస్సీ-4, ఎస్టీ-1 భర్తీ చేస్తారు.
- శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 11 పోస్టులుః ఓసీ-3, ఓసీ (ఈడబ్ల్యూఎస్)-1, ఓసీ (స్పోర్ట్స్)-1, దివ్యాంగు-1, బీసీ-ఏ-1, బీసీ-బీ-1, బీసీ-ఈ-1, ఎస్సీ-2 భర్తీ చేస్తారు.
ఎఫ్ఎన్‌వో పోస్టులకు విద్యా అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే పదో తరగతి సమానమైన విద్యా అర్హత ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ పోస్టులకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులకు విద్యా అర్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే పదో తరగతి సమానమైన విద్యా అర్హత ఉండాలి. 2024 జులై 1 నాటికి కనీసం 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు.
అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును District Medical & Health Officer, Ananthapuramu పేరుతో డీడీ తీయాలి.
ఎంపిక విధానం….
స్టాఫ్ నర్సు పోస్టులను మార్కులు ఆధారంగానే భర్తీ చేస్తారు. విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు.
అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
దరఖాస్తు ఫారమ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2025/01/2025010757.pdf అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేసి డీఎంహెచ్‌వో కార్యాలయం, అనంతపురంలో సమర్పించాలి. అదనపు వివరాలు (అర్హతలు, రిజర్వేషన్లు తదితర అంశాల గురించి)కు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2025/01/2025010757.pdf సంప్రదిచాలి.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం