APMSRB Recruitment : సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ - అదనంగా మరో 200 పోస్టులు, తాజా ప్రకటన ఇదే
APMSRB Recruitment 2025: ఏపీ వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ కు మరో 200 ఖాళీలను కలిపింది. దీంతో వీటి సంఖ్య 297కు చేరింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల ఉద్యోగాలున్నాయి.
ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. గతడాది డిసెంబర్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో కేవలం 97 ఖాళీలను మాత్రమే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దరఖాస్తులను కూడా స్వీకరించింది.

అదనంగా 200 పోస్టులు….
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సవరణ ప్రకటను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఉద్యోగాలకు అదనంగా మరో 200 పోస్టులను జతచేసింది. దీంతో భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య 297కు చేరింది.
తాజాగా ఇచ్చిన సవరణ ప్రకటనలో…. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీహెచ్‌ఎస్)కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టులు 200 కలిపినట్లు పేర్కొన్నారు. వీటిని రెగ్యూలర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో దరఖాస్తుల గడువును కూడా పెంచారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తాజా ప్రకటనలో స్పష్టం చేశారు.
దరఖాస్తుదారులు ఏంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి . 42 ఏళ్ల లోపు వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఈడబ్యూఎస్ వారికి 5 ఏళ్ల సడలింపు ఉంటుది. జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెలిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకునే వారు https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.
అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఆ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. చివరిగా తుది జాబితాను ప్రకటిస్తారు.ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం