ఏపీ హెల్త్, మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా పలు మెడికల్ కాలేజీల్లో ఖాళీలగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 128 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సంబంధిత విభాగంలో డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.68,900 - రూ.2,05,500 మధ్యం జీతం ఉంటుంది. సీటీ సర్జరీ, కార్డియోలచదీ. ఎండోక్రైనాలజీ. మెడికల్ అంకాలజీ, నెఫ్రాలజీ. న్యూరో సర్జరీ, పిడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మెరిట్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం వంద మార్కులకు ప్రమాణికంగా ఉంటుంది. ఇందులో 75 మార్కులను అభ్యర్థి అకడమిక్స్ లో సాధించిన గ్రేడ్ లేదా మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. మరో 15 మార్కులను కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వాళ్లకు కేటాయిస్తారు. మిగతా మార్కుల కోసం మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలను https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.
అర్హతలు ఉన్న అభ్యర్థులు https://dme.ap.nic.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి. దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేసిన తర్వాత విద్యా అర్హతల పత్రాలను జత చేయాలి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడ కేంద్రంగా మే 16వ తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.