AP Govt Jobs 2025 : ఫార్మసీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - రూ. 32 వేల జీతం, దరఖాస్తు తేదీలివే
వైద్యా, ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా కడప జోన్- 4లో 15 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసేందుకు జనవరి 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
కడప జోన్ - IVలో ఖాళీగా ఉన్న 15 ఫార్మసీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రకటన జారీ చేసింది. అర్హులై వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://cfw.ap.nic.in/pdf/NOTIFICATION%20FOR%20PHARMACY%20OFFICER%20Kadapa%202025.pdf లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను పొందవచ్చు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని.. వివరాలను పూర్తి చేయాలి. సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి.జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ప్రాంతీయ సంచాలకులు, వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం, కడపలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలి. నెలవారీ వేతనం రూ.32,670గా ఉంది.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన అమలు చేస్తారు.
విద్యా అర్హతలు…
1. డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీ
2. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
3. పదో తరగతి తప్పనిసరిగా పూర్తి చేయాలి.
దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. 52 ఏళ్లు దాటకూడదు.
అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, కడప పేరుతో డీడీ తీయాలి. ఈ డీడీని అప్లికేషన్‌కు జత చేయాలి. అలాగే యూపీఐ ద్వారా కూడా ఫీజును చెల్లించొచ్చు.
జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
1. పదో తరగతి సర్టిఫికెట్
2. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
3. డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీ సర్టిఫికెట్లు
4. అన్ని సంవత్సరాల డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీ పరీక్షల మార్కులు జాబితా
5. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికెట్లు
6. పాస్‌పోర్టు సైజ్ ఫోటో
7. కుల ధ్రువీకరణ పత్రం
8. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
9. సదరన్ సర్టిఫికెట్
10. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
11. సర్వీస్ సర్టిఫికెట్
12. ఇతర ఏ సంబంధిత సర్టిఫికేట్లు ఉన్నా వాటిని కూడా జత చేయాలి.
ఫార్మసీ ఆఫీసర్ పోస్టులను మార్కులు ఆధారంగానే భర్తీ చేస్తారు. విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు.
అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం