Sainik School Jobs : సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Sainik School Jobs : సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. https://sskal.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు కలికిరి సైనిక్ స్కూల్‌లో పని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లాలోని కలికిరి సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలకు జనవరి 10 ఆఖరు తేదీ అని అధికారులు చెబుతున్నారు. నాన్ టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ చరణ్‌జిత్ సింగ్ పరదేశీ వెల్లడించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పోస్టులు..
స్కూల్ మెడికల్ ఆఫీసర్, పీజీటీ (కంప్యూటర్ సైన్స్), పీజీటీ (మ్యాథమెటిక్స్), టీజీటీ (సోషల్ సైన్స్), పీటీఐ కమ్ మేట్రాన్ (ఉమెన్), కౌన్సెలర్, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వేతనం..
స్కూల్ మెడికల్ ఆఫీసర్ - రూ.73,491, పీజీటీ (కంప్యూటర్ సైన్స్)- రూ.62,356, పీజీటీ (మ్యాథమెటిక్స్)- రూ.62,356, టీజీటీ (సోషల్ సైన్స్)- రూ.58,819, పీటీఐ కమ్ మేట్రాన్ (ఉమెన్) -రూ.58,819, కౌన్సెలర్-రూ.58,819, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్- రూ.38,252 ఉంటుంది.
అర్హతలు..
ఆయా ఉద్యోగాలకు విద్యా అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్మీడియట్, బీఈడీ, బీఏ బీఈడీ, బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్), తత్సమానం.. ఇలా ఒక్కో ఉద్యోగానికి ఒక్కో క్యాలిఫికేషన్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేస్తారు. క్యాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయో పరిమితి..
2025 జనవరి 10 నాటికి స్కూల్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 50 ఏళ్ల లోపు ఉండాలి. పీజీటీ (కంప్యూటర్ సైన్స్) పోస్టుకు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. పీజీటీ (మ్యాథమెటిక్స్) పోస్టుకు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. టీజీటీ (సోషల్ సైన్స్) పోస్టుకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. పీటీఐ కమ్ మేట్రాన్ (ఉమెన్) పోస్టుకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. కౌన్సెలర్ పోస్టుకు 26-45 ఏళ్ల మధ్య ఉండాలి. హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 21-50 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఉంటుంది. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి పేరు మీద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలికిరి బ్రాంచ్ (కోడ్ః016427)కు డీడీ తీయాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?..
దరఖాస్తును కలికిరి సైనిక్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ https://sskal.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలు, అనుభవం వంటి వివరాల పొందుపర్చాలి. అప్లికేషన్‌కు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేయాలి. అప్లికేషన్ ఫీజు డీడీని కూడా జత చేయాలి. దీన్ని కలికిరిలోని ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. రిజిస్టర్ పోస్టు, లేదా స్పీడ్ పోస్టు ద్వారా కూడా పంపొచ్చు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)