ADCL Recruitment 2025 : అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌-notification released for jobs in amaravati development corporation details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Adcl Recruitment 2025 : అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌

ADCL Recruitment 2025 : అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌

HT Telugu Desk HT Telugu

Amaravati Development Corporation Jobs : అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 7 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలతో పాటు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని న‌గ‌రం అభివృద్ధి, అమ‌ల‌కు మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించిన ప‌నులు చేప‌ట్టే అమ‌రావ‌తి డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏడీసీఎల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుద‌ల చేశారు. మొత్తం ఏడు పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

వీటిలో ఆరు పోస్టుల‌కు మార్చి 28వ తేదీ సాయంత్ర 5.30 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల్సి ఉంటుంది. మరో పోస్టుకు ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5.30 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడు పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలోనే భ‌ర్తీ చేస్తున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఏడీసీఎల్ కోరుతోంది.

పోస్టుల వివ‌రాలు:

1. సీనియ‌ర్ వోహెచ్ఎస్ స్పెష‌లిస్ట్ (01)- ఆక్యూపేష‌న‌ల్‌ హెల్త్ అండ్‌ సేఫ్టీ, ఇన్విరాన్‌మెంటల్ హెల్త్‌, ఇండ‌స్ట్రీ సేఫ్టీతో పాటు వాటికి స‌మాన‌మైన విభాగాల్లో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాదాపు ప‌దేళ్ల అనుభ‌వం ఉండాలి.

2. జూనియ‌ర్ వోహెచ్ఎస్ స్పెష‌లిస్ట్ (01)- ఆక్యూపేష‌న‌ల్‌ హెల్త్ అండ్‌ సేఫ్టీ, ఇన్విరాన్‌మెంటల్ హెల్త్‌, ఇండ‌స్ట్రీ సేఫ్టీతో పాటు వాటికి స‌మాన‌మైన విభాగాల్లో బ్యాచిల‌ర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాదాపు 3 నుంచి 5 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.

3. లేబ‌ర్ ఆఫీస‌ర్ (01)- లేబ‌ర్ లా, హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌, సోష‌ల్ వ‌ర్క్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌తో పాటు వాటికి స‌మాన‌మైన విభాగాల్లో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క‌నీసం ప‌దేళ్ల అనుభవం ఉండాలి.

4. గ్రీవెన్స్ ఆఫీస‌ర్ (01)- లేబ‌ర్ లా, హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌, సోష‌ల్ వ‌ర్క్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌తో పాటు వాటికి స‌మాన‌మైన విభాగాల్లో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క‌నీసం ప‌దేళ్ల అనుభవం ఉండాలి.

5. సీనియ‌ర్ ఇన్విరాన్‌మెంటల్ స్పెష‌లిస్ట్ (01)- ఇన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, ఇన్విరాన్‌మెంటల్ ఇంజ‌నీరింగ్‌, ఏకోల‌జీ, నేచుర‌ల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌తో పాటు స‌మాన‌మైన విభాగాల్లో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క‌నీసం ప‌దేళ్ల అనుభ‌వం ఉండాలి.

6. జూనియ‌ర్ ఇన్విరాన్‌మెంటల్ స్పెష‌లిస్ట్ (01)- ఇన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, ఇన్విరాన్‌మెంటల్ ఇంజ‌నీరింగ్‌, ఏకోల‌జీ, నేచుర‌ల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌తో పాటు స‌మాన‌మైన విభాగాల్లో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క‌నీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

ఈ ఆరు పోస్టుల‌కు మార్చి 28 తేదీ సాయంత్రం 5.30 గంట‌ల లోపు అభ్య‌ర్థులు వారి రెస్యూమ్‌ను recruitment.adcl@gmail.com మెయిల్ కు పంపాలి. ఇందులో పోస్టు కోడ్‌, జాబ్ టైటిల్ పేర్కొనాల్సి ఉంటుంది. అయితే పోస్టు ద్వారా, లేదంటే వ్య‌క్తిగ‌తంగా వెళ్లి రెస్యూమ్‌ను అందిస్తే స్వీక‌రించ‌రు. పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ను సంప్ర‌దించాలి.

7. చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ (01)- సీఏ/ఐసీడ‌బ్ల్యూఏతో పాటు ఏదైనా స‌మాన‌మైన డిగ్రీ చేసి ఉండాలి. క‌నీసం ప‌ది నుంచి 15 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. బ‌డ్జెట్ కార్పొరేట్ ప్లానింగ్‌, ఫైనాన్సియ‌ల్ మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కాంట్రాక్టింగ్‌, ఆడిటింగ్‌, టాక్సెష‌న్‌, ఫండ్ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఎంఐఎస్ కంపెనీస్‌, కార్పొరేష‌న్స్‌, జీఎస్టీ, ఐటీ ఫిలింగ్ త‌దిత‌ర అంశాల్లో అనుభ‌వం ఉండాలి. క‌మ్యూనికేష‌న్‌, ప్రెజింటేష‌న్ స్కిల్స్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌, కంప్యూట‌రైజేష‌న్ ప్రొగ్రామ్స్ తదిత‌ర వాటిల్లో అనుభ‌వం ఉండాలి.

ఈ పోస్టుకు ఏప్రిల్ 2 తేదీ సాయంత్రం 5.30 గంట‌ల లోపు అభ్య‌ర్థులు త‌మ రెస్యూమ్‌ను recruitment.adcl@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాలి. అందులో పోస్టు కోడ్‌, జాబ్ టైటిల్ పేర్కొనాలి. పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ను సంప్ర‌దించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk