తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను ప్రకటించారు.
నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం…. అనపర్తి–3, బిక్కవోలు-1, రంగంపేట-2, రాజమహేంద్రవరం రూరల్-4, కడియం–3, రాజానగరం-2, కోరుకొండ-2, సీతానగరంం 2, గోకవరం–1, దేవరపల్లి-3, నల్లజర్ల–2, తాళ్ళపూడి –1, కొవ్వూరు రూరల్-1, చాగల్లు–1, పెరవలి-1, ఉండ్రాజవరంలో 1 పోస్టు ఉంది.
ఈ పోస్టుల భర్తీకి ఈ నెల 28 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వాళ్లు… జూలై 5 వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. https://eastgodavari.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేసి… విద్యార్హత పత్రాలతో పాటు ఆధార్ లేదా రేషన్ కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను జత చేయాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానికులై ఉండాలి. కనీసం పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.