AP Medical Recruitment 2024 : ఏపీ వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలివే
AP Medical Health Department Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్ లైన్ దరఖాస్తు దాఖలకు జనవరి6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం పది ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు.
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీగా జనవరి 6 ను నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ టీడీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టీఈపీ), నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ఎంహెచ్) డైరెక్టర్ అనుమతితో నియమకాలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
పోస్టులు…
మొత్తం పది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు తిరుపతి, విశాఖపట్నంల్లో ప్రభుుత్వ ల్యాబ్, డ్రగ్ స్టోర్ లో భర్తీ చేస్తారు.
1. మైక్రోబయోలజిస్ట్- 1 (అవుట్ సోర్సింగ్)
2. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్- 3 (అవుట్ సోర్సింగ్)
3. ల్యాబ్ టెక్నీషియన్-3 (అవుట్ సోర్సింగ్)
4. నిక్షయ్ ఆపరేటర్ -1 (అవుట్ సోర్సింగ్)
5. ల్యాబ్ అటెండెంట్ -1 (అవుట్ సోర్సింగ్)
6. ఫార్మసిస్ట్ -1 (కాంట్రాక్ట్)
జీతాలు….
1. మైక్రోబయోలజిస్ట్- రూ.50,000
2. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్- రూ.25,830
3. ల్యాబ్ టెక్నీషియన్-రూ.23,393
4. నిక్షయ్ ఆపరేటర్ - రూ.18,450
5. ల్యాబ్ అటెండెంట్ - రూ.15,000
6. ఫార్మసిస్ట్ -రూ.23,393
తిరుపతిలోని సీఅండ్‌డీఎస్‌టీ ల్యాబ్‌లో మైక్రోబయోలజిస్ట్- 1, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్- 3, ల్యాబ్ టెక్నీషియన్-3, నిక్షయ్ ఆపరేటర్ -1, ల్యాబ్ అటెండెంట్ -1 ఉద్యోగాలు ఉంటాయి. విశాఖపట్నంలోని స్టేట్ డ్రగ్ స్టోర్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగం ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేయాలి….
వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుసుకోవాలి. దాన్ని పూర్తి చేసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cfw.ap.nic.in/pdf/NTEP%20Notification%202024.pdf ఉపయోగించుకోవాలి. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cfw.ap.nic.in/pdf/NTEP-Annexure-II%20-%20TORs%202024.pdf ను సంప్రదించాలి. ఇతర ఎటువంటి సందేహాలు ఉన్నా ఎస్. అరుణ కుమారి (స్టేట్ పీపీఎం కోఆర్డినేటర్) 9951529404ను సంప్రదించాలి.
దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. దీనిని డీడీ తీసి దరఖాస్తుకు జత చేయాలి.
దరఖాస్తుకు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
1. పాస్‌పోర్టు సైజ్ పోటో
2. పదో తరగతి సర్టిఫికేట్
3. కుల ధ్రువీకరణ పత్రం
4. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
5. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
6. పీహెచ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్
7. వీటితో పాటు ఆయా పోస్టులకు సంబంధించిన అర్హత సర్టిఫికేట్లు, మార్కుల జాబితాలు, అనుభవం ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్ :జగదీశ్వరరావు జరజాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం