ఏపీ హైకోర్టులో 'లా క్లర్క్‌' ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే-notification for the recruitment of law clerk posts in ap high court ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ హైకోర్టులో 'లా క్లర్క్‌' ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ హైకోర్టులో 'లా క్లర్క్‌' ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే

ఏపీ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 4 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూలై 19వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

లా క్లర్క్ ఉద్యోగాలు - ముఖ్యమైన వివరాలు

  • ఉద్యోగ ప్రకటన - హైకోర్టు, ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగాలు - లా క్లర్క్
  • మొత్తం ఖాళీలు - 04
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదేళ్లు లేదా మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో జూలై 19 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల వయో పరిమితి 18-30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తులను... రిజిస్ట్రార్‌, హైకోర్ట్‌ ఆఫ్‌ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ - 522239 చిరునామా కు పంపించాలి.
  • ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అభ్యర్థులను విద్యార్హతలు, మెరిట్‌ మార్కులు, వైవా వాయిస్‌(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతం ఇస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://aphc.gov.in/

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.