విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో 45 ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన తేదీలు, వివరాలివే-notification for the recruitment of clerical trainee posts in visakhapatnam co operative bank details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో 45 ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన తేదీలు, వివరాలివే

విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో 45 ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన తేదీలు, వివరాలివే

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 క్లరికల్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జులై 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్‌ ట్రైనీ పోస్టులు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 క్లరికల్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నిజానికి జూన్ 30వ తేదీతోనే గడువు పూర్తి కాగా… అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి హైదరాబాద్, నెల్లూరు, రాయలసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. https://www.vcbl.in/downloads వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు

  • ఉద్యోగ నోటిఫికేషన్ - విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్.
  • మొత్తం ఖాళీలు - 45
  • పోస్టులు - క్లరికల్‌ ట్రైనీ ఉద్యోగాలు
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పాటు ఇంగ్లీష్, తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి.
  • 01.06.2025 నాటికి 30 ఏళ్ల వయసు మించకూడదు. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు రుసుం కింద రూ. 100 చెల్లించాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్/ ఆఫ్ లైన్(అప్లికేషన్ ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో ఉంటుంది)
  • జీతం - ట్రైనీ సమయంలో నెలకు రూ.15,000 ఇస్తారు.పైగా అలవెన్సులు ఉంటాయి.
  • రాత పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.vcbl.in/downloads
  • ఏమైనా సందేహాలు ఉంటే 08912788462 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.