Kadapa Uranium Corporation : కడప యురేనియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Kadapa Uranium Corporation : కడప యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 12 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
కడప యురేనియం కార్పొరేషన్‌లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), టర్నర్/ మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్లలో 32 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నారు.
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..
ఫిట్టర్ -9, ఎలక్ట్రీషియన్ -9, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) -4, టర్నర్ / మెషినిస్ట్ -3, మెకానికల్ డీజిల్ -3, కార్పెంటర్ -2, ప్లంబర్ -2 మొత్తం 32 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు..
పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిస్ చేరిన వారు దరఖాస్తు దాఖలు చేసేందుకు అనర్హులు.
వయో పరిమితి..
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 13 వరకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
అప్రెంటిస్‌షిప్‌కు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐటీఐలో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఎలా?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. తొలిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ టాబ్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతోంది. అప్లికేషన్‌లో అడిగిన వివరాలు పొందుపరచాలి. అనంతరం రిజిస్ట్రార్ ఈ మెయిల్ ఐడీ కన్ఫ్మేషన్ మెయిల్ వస్తుంది. అభ్యర్థి ఈ మెయిల్‌లో ఐడీలో లింక్‌ను క్లిక్ చేసి లాగ్ ఇన్ అవ్వాలి. అప్పుడు మళ్లీ అందులో అడిగిన వివరాలు పొందుపరచాలి.
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు..
1. పదో తరగతి సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్
2. కుల ధ్రువీకరణ పత్రం
3. దివ్యాంగులైతే మెడికల్ సర్టిఫికేట్
4. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్
5. ఫోటో అండ్ సిగ్నేచర్
6. ఆధార్ కార్డు, పాన్ కార్డు
7. ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ పాస్ బుక్
8. ప్రాజెక్టు ప్రభావిత అభ్యర్థులైతే.. భూ సేకరణ సర్టిఫికేట్
అదనపు వివరాలు..
నోటిఫికేషన్‌కు సంబంధించి అదనపు వివరాల కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ డైరక్ట్ లింక్‌ను క్లిక్ చేయాలి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)