AP Medical Jobs 2025 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే-notification for the recruitment of 146 assistant professor posts in ap medical colleges ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Medical Jobs 2025 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే

AP Medical Jobs 2025 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే

HT Telugu Desk HT Telugu

ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు మార్చి 24వ తేదీన నిర్వహించే ఇంటర్వూలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 14 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో 146 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లాటరల్ ఎంట్రీ ద్వారా నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేరకు రాష్ట్ర మెడిక‌ల్ స‌ర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. పోస్టుల‌ను ఇంటర్వ్యూ ద్వారానే భ‌ర్తీ చేస్తారు. ఈనెల 24న ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావాల‌ని నియామ‌క‌పు బోర్డు కోరుతుంది.

విభాగాల వారీగా పోస్టులు:

మొత్తం 14 విభాగాల్లో 146 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…..

1. సి.టి సర్జరీ- 15

2. కార్డియాలజీ -15

3. ఎండోక్రినాలజీ- 5

4. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ- 9

5. మెడికల్ ఆంకాలజీ -16

6. నియోనాటాలజీ -2

7. నెఫ్రాలజీ -19

8. న్యూరో సర్జరీ -16

9. న్యూరోలజీ -13

10. పీడియాట్రిక్ సర్జరీ -5

11. ప్లాస్టిక్ సర్జరీ -4

12. సర్జికల్ ఆంకాలజీ -14

13. యూరాలజీ -12

14. వాస్కులర్ సర్జరీ 1

సూపర్ స్పెషాలిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు ఎంసీఐ/ఎన్ఎంసీ గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత సూపర్ స్పెషాలిటీలో పీజీ డిగ్రీ (డీఎన్‌బీ/ డీఎం/ఎంసీహెచ్‌) చేసి ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు లోక‌ల్‌ అభ్య‌ర్థులు అర్హులు కాగా…. నాన్ లోకల్ అభ్య‌ర్థుల‌కు అన‌ర్హులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు నెల‌వారి వేత‌నం 7వ యూజీసీ పే స్కేల్ ఆధారంగా రూ.68,900 నుంచి రూ.2,05,500 వ‌ర‌కు ఉంటుంది. అలాగే అద‌నంగా మ‌రో రూ.30,000 సూప‌ర్ స్పెషాలిటీ అలవెన్స్‌లు ఉంటాయి.

వ‌యో ప‌రిమితి…

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 2025 మార్చి 13 నాటికి ఓసీల‌కు 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

2. ఈడ‌బ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల వ‌యస్సు 47 ఏళ్ల మించ‌కూడ‌దు.

3. దివ్యాంగు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 52 ఏళ్ల మించ‌కూడ‌దు.

4. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల వ‌య‌స్సు 50 ఏళ్లు మించ‌కూడదు.

దరఖాస్తు చేసుకుని అన్ని అర్హత నిబంధనలను పూర్తి చేసిన అభ్యర్థులందరికీ మెరిట్ లిస్ట్‌ను త‌యారు చేస్తారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మెరిట్ లిస్ట్‌, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక జాబితా తయారు చేస్తారు. 100 మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అందులో అర్హత డిగ్రీలో పొందిన మార్కులు/గ్రేడ్ ఆధారంగా 75 మార్కులు కేటాయిస్తారు. పీజీ మార్కుల మెమో లేదా గ్రేడ్ లేని వారికి, మార్కుల శాతాన్ని 50 శాతం (50% x 75 = 37.50) గా పరిగణిస్తారు.

అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటి నుండి సంవత్సరాలకు వెయిటేజ్ ఆధారంగా 10 మార్కులు కేటాయిస్తారు. ప్రతి పీజీ/పీజీ ఉత్తీర్ణ‌త‌/సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కుల వరకు ఉంటాయి. జాతీయ‌ సంస్థల నుండి పీజీ/సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన అభ్యర్థులకు 5 మార్కుల వెయిటేజీ ఇస్తారు. ప్రభుత్వ సంస్థలలో తమ సేవలను అందించిన వారికి 15 మార్కులు ఉంటాయి. అలాగే ఆరు నెల‌ల పాటు ట్రైబుల్ ఏరియాలో ప‌నిచేసే వారికి 2.5 మార్కులు, రూర‌ల్ ఏరియాలో ప‌నిచేసేవారికి రెండు మార్కులు, అర్బ‌న్ ఏరియాలో ప‌ని చేసేవారికి ఒక మార్కులు ఇస్తారు.

అప్లికేష‌న్ ఫీజు కింద జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.1,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.500 ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజును ఇంట‌ర్వ్యూ జ‌రిగిన‌ప్పుడే ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఇంట‌ర్వ్యూ ఎప్పుడు…?

ఇంట‌ర్వ్యూలను మార్చి 24 (సోమ‌వారం) ఉద‌యం 10.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు O/o Director of Medical Education, Old GGH Campus, హనుమాన్ పేట, విజయవాడ లో నిర్వహిస్తారు.

కావాల్సిన ధ్రువీకరణపత్రాలు…

1. పాస్‌పోర్టు సైజ్ ఫోటో

2. ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్ (డేట్ ఆఫ్ బ‌ర్త్‌కు ఫ్రూప్‌).

3. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు.

4. ఇంట‌ర్మీడియ‌ట్ స‌ర్టిఫికెట్

5. ఎంబీబీఎస్ స‌ర్టిఫికెట్

6. పీజీ డిగ్రీ స‌ర్టిఫికెట్

7. పీజీ డిగ్రీ మార్కుల జాబితా

8. ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్.

9. దివ్యాంగు స‌ర్టిఫికేట్ (స‌ద‌రం).

10. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk

సంబంధిత కథనం