TG District Courts Recruitment 2025 : తెలంగాణ కోర్టుల్లో భారీగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - 10వ తరగతి అర్హత, వివరాలివే-notification for the recruitment 2025 of office subordinate jobs in district courts of telangana with 10th qualification ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg District Courts Recruitment 2025 : తెలంగాణ కోర్టుల్లో భారీగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - 10వ తరగతి అర్హత, వివరాలివే

TG District Courts Recruitment 2025 : తెలంగాణ కోర్టుల్లో భారీగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - 10వ తరగతి అర్హత, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 05, 2025 05:21 AM IST

Telangana Courts Recruitment 2025 : తెలంగాణని కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 479 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 8 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమై.. 31వ తేదీతో ముగుస్తుంది.

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు
తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

తెలంగాణలో జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తాజాగానే హైకోర్టు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే ఇందులో 7వ తరగతి నుంచి 10 తరగతి అర్హతతోనే భర్తీ చేసే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 479 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా వెల్లడించారు.

yearly horoscope entry point

ఈనెల 8 నుంచి అప్లికేషన్లు…..

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు జనవరి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టును అనుసరించి రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతం ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 45 మార్కులకు రాత పరీక్ష ఉంటే.. మరో 5 మార్కులు ఇంటర్వుకు కేటాయిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. 45 మార్కుల్లో 30 క్వశ్చన్స్ జనరల్ నాల్డెజ్ నుంచి వస్తాయి. మరో 15 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - హైకోర్టు, తెలంగాణ రాష్ట్రం,
  • ఉద్యోగాలు - ఆఫీస్ సబార్డినేట్
  • ఖాళీలు - 479 పోస్టులు
  • అర్హతలు - 7వ తరగతి నుంచి 10వ తరగతి లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జీతం - రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతం ఉంటుంది.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 8, జనవరి 2025
  • ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ -31 జనవరి 2025
  • రాత పరీక్షలు - ఏప్రిల్ 2025లో నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఐదు మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అధికారిక లింక్ - https://tshc.gov.in/showChildDocTypes?id=95

ఈ కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. మొత్తం1,673 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పోస్టుల్లో భాగంగానే… ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలను కూడా భరీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు 1673 ఉండగా… టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌ వంటి పోస్టులకు లా డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

Whats_app_banner

సంబంధిత కథనం