AP Govt Contract Jobs : మన్యం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 12ను ఆఖరు తేదీగా నిర్ణయించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్సిన్ యూనిట్ (డీసీపీయూ), ఎస్ఏఏ, చిల్డ్రన్ హోంలో ఖాళీగా ఉన్న 8 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తామని తెలిపారు.
ఇందులో అర్హులైన స్థానిక అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం జరుపుతారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఉద్యోగులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. పోస్టును బట్టి ఏడో తరగతి, పదో తరగతి, డిగ్రీ, ఎంబీబీఎస్ విద్యార్హతతో పాటు అనుభవం అవసరం ఉంటుంది.
8 పోస్టుల భర్తీ…
మొత్తం 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సోషల్ వర్కర్-1, అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్-1, డాక్టర్-1, కుక్-2, హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-2, హౌస్ కీపర్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
నెలవారీ వేతనం…..
1. సోషల్ వర్కర్ పోస్టుకు రూ.18,536
2. అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.13,240
3. డాక్టర్ పోస్టుకు రూ.9,930
4. కుక్ పోస్టులకు రూ.9,930
5. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్ పోస్టులకు రూ.7,944
6. హౌస్ కీపర్ పోస్టులకు రూ.7,944
అన్ని పోస్టులకు వయో పరమితి 25ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. డాక్టర్ పోస్టుకు మాత్రం ఎటువంటి వయో పరిమితి లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s31679091c5a880faf6fb5e6087eb1b2dc/uploads/2024/11/2024113077.pdf ను క్లిక్ చేయండి.
దరఖాస్తు ఇలా చేయాలి…
దరఖాస్తు దాఖలు చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s31679091c5a880faf6fb5e6087eb1b2dc/uploads/2024/11/2024113017.pdf క్లిక్ చేసి అప్లికేషన్ ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌లో ఖాళీలను పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, డిసెంబర్ 12 తేదీ, సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, డి. నెం. 12/23 (రామనందనగర్ స్వామి హాస్పటిల్ ఎదురుగా) పార్వతీపురం మన్యం జిల్లాకి అందజేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం