Visakhapatnam : విశాఖపట్నం టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్వ్యూతోనే జాబ్
Visakhapatnam : విశాఖ టాటా మెమోరియల్ సెంటర్ (హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న ఉదయం ఇంటర్వ్యూ ఉంటుంది.
విశాఖపట్నం టాటా మెమోరియల్ సెంటర్‌లో 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సీనియర్ సూపర్ వైజర్- 1, ప్రాజెక్టు కోఆర్డినేటర్-1, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్-8, డేటా ఎంట్రీ ఆపరేటర్-2 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు..
1. సీనియర్ సూపర్ వైజర్ పోస్టుకు పీజీ తోపాటు ఆరు నెలల కంప్యూటర్ కోర్సు తప్పనిసరి. మూడేళ్ల అనుభవం ఉండాలి.
2. ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుకు డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేయాలి. ఏడాది అనుభవం ఉండాలి.
3. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేయాలి. ఏడాది అనుభవం ఉండాలి.
4. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ పూర్తి చేయాలి. ఏడాది పాటు అనుభవం ఉండాలి.
వయో పరిమితి..
18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం..
1. సీనియర్ సూపర్ వైజర్‌కు రూ.23,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది.
2. ప్రాజెక్టు కోఆర్డినేటర్‌కు రూ.21,100 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది.
3. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.21,100 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది.
4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.21,100 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మొదటి అంతస్తులో ఇంటర్వ్యూలు జరుగుతాయి. హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా తోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సెల్ఫ్ అటెస్టేడ్ సెట్ తీసుకెళ్లాలి. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డెరెక్ట్ లింక్ లో సంప్రదించాలి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)