AP TG Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే-notification for filling up the posts of supervisor and operators in aadhaar seva centers in ap and telangana ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Tg Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

AP TG Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jan 08, 2025 11:21 AM IST

ఏపీ, తెలంగాణ‌ల్లో ఆధార్ సేవా కేంద్రాల్లోఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఏపీలో జనవరి 31, తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు
ఆధార్ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో ఆధార్ సేవా కేంద్రాల్లో (ఏఎస్‌కే) సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను సీఎస్‌సీ ఈ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆహ్వానిస్తుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జన‌వ‌రి 31, తెలంగాణ‌లో ఫిబ్ర‌వ‌రి 28 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి కోరుతోంది.

yearly horoscope entry point

ఏపీలో ఎన్ని ఉద్యోగాలు...ఎక్క‌డెక్క‌డ‌?

ఏపీలో ఆధార్ సేవా కేంద్రాల్లో మొత్తం ఎనిమిది సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నారు. అందులో విశాఖ‌ప‌ట్నం-3, కృష్ణా-1, శ్రీకాకుళం-1, తిరుప‌తి-1, విజ‌య‌న‌గ‌రం-1, వైఎస్ఆర్ క‌డ‌ప-1 పోస్టును భ‌ర్తీ చేస్తున్నారు.

తెలంగాణలో ఖాళీల వివరాలు…

తెలంగాణ‌లో మొత్తం 16 సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో పోస్టును భ‌ర్తీ చేస్తున్నారు.

ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కే) సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులకు 12వ త‌ర‌గ‌తి (ఇంట‌ర్మీడియ‌ట్, సీనియ‌ర్ సెకెండ‌రీ) పూర్తి చేయాలి. లేదా ప‌దో త‌ర‌గ‌తితోపాటు రెండేళ్ల ఐటీఐ పూర్తి చేయాలి. లేక‌పోతే ప‌దో త‌ర‌గ‌తితో పాటు మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ప్రాథ‌మిక కంప్యూట‌ర్ స్కిల్స్ ఉండాలి. ఆధార్ సేవ‌లందించ‌డానికి ఆథారిటీ గుర్తించిన సంస్థ‌ల ద్వారా జారీ చేసిన ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజ‌ర్ స‌ర్టిఫికేట్ క‌లిగి ఉండాలి.

ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కే) సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల క‌నీస వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌ - దరఖాస్తు విధానం..

ఆధార్ సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టుల‌కు విద్యా అర్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ఇంటర్వ్యూ, ఇత‌ర ప‌రీక్ష‌ల ద్వారా తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైప్‌లో చేసుకోవాలి. ఏపీకి చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://career.csccloud.in/apply-now/MjU0 ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ‌కు చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://career.csccloud.in/apply-now/Mjc3 ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఈ లింక్స్ను క్లిక్ చేసిన వెంట‌నే ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ద‌ర‌ఖాస్తులోని ఖాళీల (పేరు, ఫోన్ నెంబ‌ర్, ఈమెయిల్ ఐడీ, పాన్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వంటి ఖాళీల‌ను)ను పూరించాలి. అందులోనే రెజ్యూమ్‌, ఆధార్ సూప‌ర్‌వైజ‌ర్ స‌ర్టిఫికేట్‌ను అప్లొడ్ చేయాలి. ఏపీకి చెందిన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 31, తెలంగాణకు చెందిన వారు ఫిబ్ర‌వ‌రి 28 లోపు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం