ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-notification for filling up sarva shiksha abhiyan posts in ap apply like this ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu

ఏపీలో సర్వ శిక్ష అభియాన్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 26 జిల్లాల్లో 103 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ఏపీలో స‌ర్వ శిక్ష అభియాన్‌లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఎడ్యుకేష‌న్ క‌న్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (ఈడీసీఐఎల్) సంస్థ నుంచి కెరీర్ అండ్ మెంట‌ల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు ఆఖ‌రు తేదీగా ఏప్రిల్ 20న నిర్ణయించారు. ఏపీలోని 26 జిల్లాల్లో 103 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఉద్యోగాలు

మొత్తం 103 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ పోస్టులను 26 జిల్లాల్లో 103 భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపిక అభ్యర్థుల‌కు 2026 మార్చి వ‌ర‌కు టెర్మ్ ఉంటుంది. ఆ త‌రువాత వ‌చ్చే అకాడ‌మిక్ ఇయ‌ర్ నుంచి మ‌రో ప‌ది నెల‌లు పాటు పెంచుతారు.

అర్హత‌లు

కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల‌ర్స్ పోస్టుల‌కు విద్యా అర్హత ఎంఎస్సీ సైకాల‌జీ, ఎంఏ సైకాల‌జీ, బ్యాచిల‌ర్ సైకాల‌జీ త‌ప్ప‌నిస‌రిగా చేసి ఉండాలి. అలాగే కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సింగ్‌లో డిప్లొమా అయినా చేసి ఉండాలి.

వ‌యో ప‌రిమితి

2025 మార్చి 31 నాటికి 45 ఏళ్ల వ‌య‌స్సు దాట కూడ‌దు.

వేత‌నం

నెల‌కు రూ.30,000 వేత‌నం

ఎంపిక ప్ర‌క్రియ

ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష, ఫీజు లేదు. ఇంట‌ర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. అర్హ‌త‌లు, వ‌య‌స్సు, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అయితే ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టు చేసి ఇంట‌ర్య్వూ లెట‌ర్స్ పంపిస్తారు.

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు ఇలా

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఏప్రిల్ 20వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. డిపార్ట్‌మెంట్ ఇచ్చిన గూగుల్ ఫారంని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి స‌బ్మిట్ చేయాలి. విద్యా అర్హ‌త‌, అనుభ‌వం, ఫోటోలు, రెస్యూమ్ వంటి వన్నీ పీడీఎఫ్ ఫార్మెట్‌లోనే అప్లోడ్ చేయాలి. ఈ గూగుల్ ఫారం https://docs.google.com/forms/d/e/1FAIpQLSdk1ioMM3zHgBeMoodcySjnLlKLGASX44rhiFGHlZBeX1Ft-A/viewform లో ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవాలి.

సందేహాలుంటే ఈ-మెయిల్ tsgrecruitment9@gmail.comను సంప్రదించాలి.

అద‌న‌పు స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://www.edcilindia.co.in/Default/ViewFile/?id=1744283872529_Detailed%20Advertisement%20for%20engagement%20of%20Career%20and%20Mental%20Health%20counsellors%20(Phase%203).pdf&path=TCareer సంప్ర‌దించండి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం