Srikakulam District Jobs 2025 : శ్రీకాకుళం జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలు, షెడ్యూల్ వివరాలివే-notification for filling up posts in srikakulam district super specialty hospital and kidney research center ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Srikakulam District Jobs 2025 : శ్రీకాకుళం జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలు, షెడ్యూల్ వివరాలివే

Srikakulam District Jobs 2025 : శ్రీకాకుళం జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలు, షెడ్యూల్ వివరాలివే

HT Telugu Desk HT Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా సూప‌ర్ స్పెష‌లిటీ ఆసుప‌త్రి, కిడ్నీ రీసెర్చ్ సెంట‌ర్‌లో ఖాళీగా ఉన్న 13 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానంతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లా సూప‌ర్ స్పెష‌లిటీ ఆసుప‌త్రి, కిడ్నీ రీసెర్చ్ సెంట‌ర్ (ప‌లాస‌)లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఏప్రిల్ 6న ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న‌వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా… మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఖాళీల వివరాలు:

1. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్- 01

2. డయాలసిస్ టెక్నీషియన్స్ - 06

3. సీ ఆర్మ్ టెక్నీషియ‌న్స్ - 02

4. జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్స్ - 03

5. సెక్యూరిటీ గార్డ్‌ -01

రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.18,500 జీతం చెల్లిస్తారు. ఇక డయాలసిస్ టెక్నీషియన్స్- రూ.32,670, సీ ఆర్మ్ టెక్నీషియ‌న్స్ - రూ.32,670, జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్స్ - రూ.15,000, సెక్యూరిటీ గార్డ్‌ కు రూ.15,000 వేతనం ఇస్తారు.

అర్హతలు….

1. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్: ఏదైనా డిగ్రీ, కంప్యూట‌ర్ కోర్సు స‌ర్టిఫికెట్‌

2. డయాలసిస్ టెక్నీషియన్స్: డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ కోర్సు పూర్తి చేయాలి. ఏపీపీఎంబీ, ఏపీఏహెచ్‌సీపీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేష‌న్ తప్పనిసరి.

3. సీ ఆర్మ్ టెక్నీషియ‌న్స్ : డీఎంఐటీ కోర్సు పూర్తి చేయాలి. ఏపీపీఎంబీ, ఏపీఏహెచ్‌సీపీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేష‌న్ ఉండాలి.

4. జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్స్ : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త

5. సెక్యూరిటీ గార్డ్ : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త

ఎంపిక విధానం….

ఎంపిక ప్ర‌క్రియ‌లో వంద మార్కులు ఉంటాయి. అందులో విద్యా అర్హ‌త‌లోని స‌బ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభ‌వానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గ‌రిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభ‌వానికి సంబంధించి మార్కుల‌ను కూడా గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు 2 మార్కులు కేటాయిస్తారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక మార్కు కేటాయిస్తారు. కరోనా సేవల్లో ఆరు నెల‌ల పాటు అందిస్తే 5 మార్క‌ులు, ఏడాది పాటు అందిస్తే 10 మార్కులు, ఏడాద‌న్న‌ర అందిస్తే 15 మార్కులు ఇస్తారు. ఆరు నెల‌ల కంటే త‌క్కువ ఉన్న‌స‌ర్వీసుకు ఎటువంటి వెయిటేజ్ ఇవ్వ‌రు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు… 2025 మార్చి 1 నాటికి వ‌య‌స్సు 42 ఏళ్లలోపు మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు మిన‌హాయింపు. ఫీజును “Hospital Development Society, Kidney Research Centre and Super Specialty Hospital, Palasa, Srikakulam District" పేరిట డీడీ తీయాలి. డీడీని ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాలి.

నియామ‌క షెడ్యూల్ వివరాలు:

  • ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు ఆఖ‌రు తేదీ : ఏప్రిల్ 6
  • ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి : ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 21 వ‌ర‌కు
  • మెరిట్ లిస్ట్ విడుద‌ల : ఏప్రిల్ 22
  • మెరిట్ లిస్ట్‌పై ఫిర్యాదులు, అభ్యంత‌రాలు చేసేందుకు గ‌డువు : ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 వ‌ర‌కు
  • తుది మెరిట్ జాబితా త‌యారీ : ఏప్రిల్ 26
  • ఆర్‌వోఆర్ ప్ర‌కారం సెలక్ష‌న్ లిస్ట్ త‌యారీ : ఏప్రిల్ 28
  • తుది మెరిట్ లిస్ట్‌, సెల‌క్ష‌న్ లిస్ట్ విడుద‌ల : ఏప్రిల్ 29
  • ఎంపికైన అభ్య‌ర్థుల‌కు కౌన్సిలింగ్ : ఏప్రిల్ 30
  • ఎంపికైన అభ్య‌ర్థుల జాయినింగ్ : ఏప్రిల్ 30

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు ఫామ్ ను https://srikakulam.ap.gov.in./ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్‌ను “The office of the Superintendent, Kidney Research Centre and Super Specialty Hospital, Palasa, Srikakulam District” చిరునామాకు ఏప్రిల్ 6వ‌ తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk