ఏపీ డైరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల-notification for filling up of posts on contract basis in ap dairy development cooperative federation ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డైరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల

ఏపీ డైరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల

ఏపి డైరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి....

ఏపీ డైరీ ఫెడరేషన్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని నిరుద్యోగులకు మరో అలర్ట్ వచ్చేసింది. డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించుటకు పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు - దరఖాస్తు విధానం

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. హెడ్ ఆఫీస్ మంగళగిరిలో 2 ఖాళీలు ఉండగా.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ -పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు జిల్లాలో ఒక్కో ఖాళీ ఉంది.

జీతం ఎంతంటే…

ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవుతారు. తరువాత అవసరమైతే పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్లో మే 26వ తేదీ సా.5 గంటల లోపు సమర్పించాలి. https://apddcf.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఏమైనా వివరాలను తెలుసుకునేందుకు 0863-23810 81/83/85 నెంబర్లను సంప్రదించవచ్చు. లేక notification25.apddcf@gmail.com కు మెయిల్ చేయవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • ఉద్యోగాల పేరు - మేనేజర్(డిస్ట్రిక్ లెవల్)
  • మొత్తం ఖాళీలు - 09
  • అర్హతలు - డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
  • నెల జీతం - ఎంపికైన వారికి నెలకు 20,000 జీతం చెల్లిస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 26 మే 2025.
  • అధికారిక వెబ్ సైట్ - https://apddcf.ap.gov.in
  • మెయిల్ అడ్రస్ - notification25.apddcf@gmail.com

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.