అలర్ట్… ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగ ఖాళీలు - నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం, పూర్తి వివరాలివే-notification for filling 1620 court jobs in andhrapradesh online applications begins from today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  అలర్ట్… ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగ ఖాళీలు - నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం, పూర్తి వివరాలివే

అలర్ట్… ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగ ఖాళీలు - నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం, పూర్తి వివరాలివే

ఏపీలోని జిల్లా కోర్టుల్లో1,620 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 2వ తేదీతో గడువు ముగుస్తుంది.

ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్...! జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదల కాగా... నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లోకలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా… ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

చివరి తేదీ ఎప్పుడంటే

నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుండగా… జూన్ 2వ తేదీతో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి. మొత్తం 10 రకాల పోస్టులు ఉండగా.. వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా అర్హతలు ఉన్నాయి. ఈ వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

  1. ఆఫీస్ సబార్డినేట్ – 651
  2. జూనియర్ అసిస్టెంట్ – 230
  3. కాపీయిస్ట్ – 193
  4. ప్రాసెస్ సర్వర్ – 164
  5. టైపిస్ట్ – 162
  6. స్టెనోగ్రాఫర్ – 80
  7. ఫీల్డ్ అసిస్టెంట్ – 56
  8. ఎగ్జామినర్ – 32
  9. రికార్డు అసిస్టెంట్ – 24
  10. డ్రైవర్ - 28

అర్హతలు….

పైన పేర్కొన్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా టైపింగ్ వచ్చి ఉండటమే కాకుండా… కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి. ఇక ఆఫీస్ సబార్డినెట్ ఆఫీసులకు ఏడో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కూడా ఏడో తరగతి పాసై.... డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రాసెస్ సర్వర్ పోస్టులకు టెన్త్ అర్హత సరిపోతుంది.

కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.అంతేకాకుండా వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష…

కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.

రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.

దరఖాస్తు విధానం ఎలా...?

కోర్టు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. పార్టీ ఏ తో పాటు పార్ట్ బీ పూర్తి చేయాలి. పార్టీ ఏ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ వివరాలతో పార్ట్ బీలో ఉండే అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయవచ్చు. పార్ట్ ఏలో జనరేట్ అయ్యే OTPR ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లతో పాటు రాత పరీక్ష తేదీలను కూడా ఈ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. ఈ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/recruitments.php లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా 0863-2372752 నెంబర్ ను సంప్రదించవచ్చు. ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో కాల్స్ చేయవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం